Begin typing your search above and press return to search.

శెట్టి జోడి.. ఈసారైనా ఫిక్స్ చేస్తారా?

యంగ్ హీరో నవీన్ పోలి శెట్టి, అనుష్క జంటగా నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి

By:  Tupaki Desk   |   11 Aug 2023 10:36 AM GMT
శెట్టి జోడి.. ఈసారైనా ఫిక్స్ చేస్తారా?
X

యంగ్ హీరో నవీన్ పోలి శెట్టి, అనుష్క జంటగా నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి. ఈ మూవీ కోసం ఎదురు చూసి, చూసి ప్రేక్షకులకే విసుగొస్తోంది. ప్రతి మూవీని నిర్మాతలు తాము అనుకున్న తేదీకే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనుకుంటారు. కానీ, అందుకు కుదరకపోవచ్చు. కొన్ని సార్లు మూవీ వాయిదా పడుతూ ఉంటుంది. ఇది చాలా కాజ్యువల్. కానీ, ఈ మిస్ శెట్టి, మిస్టర్ పొలి శెట్టి మాత్రం ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది.

ప్రతిసారీ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించడం, ఇది కన్ఫామ్ అనుకునేలోపు మళ్లీ వాయిదాపడుతూనే ఉంది. నిజానికి ఈ మూవీ జూన్ లో లో ప్రేక్షకుల ముందుకు రావా్లసింది. కానీ, ఆగస్టు కూడా అయిపోవస్తున్నా కూడా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. మొదట జూన్ అన్నారు. తర్వాత జులై అన్నారు. చివరకు ఆగస్టులో కన్ఫామ్ అన్నారు. కానీ, ఇప్పుడు సెప్టెంబర్ కి వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాను సెప్టెంబర్ 7వ తేదీన విడుదల చేస్తామని కొత్త తేదీని ప్రకటించారు.

అయితే, ఈ డేట్ కి అయినా మూవీని థియేటర్స్ కి తీసుకువస్తారా అనే సందేహాలు కలుగుతున్నాయి. అసలు ఈ మూవీని ఇన్ని సార్లు ఎందుకు వాయిదా వేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. ఇన్ని సార్లు ఇలా పోస్ట్ పోన్ చేయడం వల్ల సినిమాపై ఆసక్తిపోయే ప్రమాదం లేకపోలేదు.

ఈ సినిమా దాదాపు అందరూ కేవలం అనుష్క కోసమే ఎదురు చూస్తున్నారు. అనుష్కను తెర పై చూసి చాలా కాలమే అవుతోంది. చివరగా అనుష్క నిశ్శబ్దం అనే సినిమా చేసింది. ఆ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత ఒక్క కథ కూడా అంగీకరించలేదు. చాలా రోజుల తర్వాత ఈ సినిమా ఒప్పుకుంది అనే సరికి, ఇలా అయినా అనుష్కను చూడొచ్చు అని అందరూ అనుకున్నారు. కానీ, ఈ మూవీ కారణం లేకుండా పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు.

ఇదిలా ఉండగా, ప్ర‌ముఖ నిర్మాణ యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేష్ బాబు.పి ద‌ర్శ‌క‌త్వంలో వంశీ, ప్ర‌మోద్ నిర్మిస్తున్నారు. అన్విత ర‌వళి శెట్టి పాత్ర‌లో అనుష్క‌.. స్టాండ‌ప్ క‌మెడియ‌న్‌ సిద్ధు పొలిశెట్టి పాత్ర‌లో న‌వీన్ పొలిశెట్టి కనిపించనున్నారు. పి మహేష్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండబోతోంది.. అసలు ఈ చిత్రంలో అనుష్క గ్లామర్.. నవీన్ కామెడీ టైమింగ్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి.