మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ END అయిందా?
టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రికనింగ్ (ఎంఐ 7), ఫైనల్ రికనింగ్ (ఎంఐ 8) చిత్రాలతో ముగింపు ఉంటుందని అధికారిక ప్రకటన వెలువడింది.
By: Tupaki Desk | 27 May 2025 4:15 AMటామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రికనింగ్ (ఎంఐ 7), ఫైనల్ రికనింగ్ (ఎంఐ 8) చిత్రాలతో ముగింపు ఉంటుందని అధికారిక ప్రకటన వెలువడింది. ఈ రెండు సినిమాలు భారతదేశంలో భారీ ఓపెనింగులతో ప్రారంభమయ్యాయి. ఎంఐ 8 చిత్రం నాన్ అవతార్, నాన్ మార్వల్ రికార్డులను బద్ధలుకొడుతూ 21 కోట్ల ఓపెనింగులను సాధించింది. ఎంఐ 7 తరహాలో ఎంఐ8 లో భారీ అడ్వెంచరస్ సన్నివేశాలు, గుగుర్పాటుకు గురి చేసే విషయాలేవీ లేకపోయినా ఉత్కంఠ రేపే డ్రామా, ఎంఐ సిరీస్ కి ఉన్న క్రేజ్ భారీ ఓపెనింగులకు సాయమైంది.
ఈ సినిమా రిలీజైన రెండో వారంలోను థియేటర్లలో ఆడుతోంది. కానీ `మిషన్: ఇంపాజిబుల్ - ది ఫైనల్ రెకనింగ్` ఫ్రాంఛైజీలో చిట్ట చివరి సినిమా అని ప్రకటించింది చిత్రబృందం. నిజంగా ఇది ఫ్రాంచైజీ ముగింపునా? అంటే ఈ సినిమాలో నటించిన తారాగణం ఏం చెబుతోంది అంటే...! ఎంఐ సిరీస్‌కి ముగింపు అనేదే ఉండదు. టామ్ క్రూజ్ సాహసాలకు వెనకాడరు. ఆయన ఫ్రాంఛైజీని నడిపించాలని అనుకుంటే, దీని కథలకు అంతూ దరీ ఉండదు అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
ఈ మిషన్ అసాధ్యం కావచ్చు, కానీ ఫ్రాంచైజీలో కొత్త సినిమా రావడం సాధ్యమే! `నెవర్ సే నెవర్` అనే నినాదంతో, మొత్తం స్టార్ కాస్ట్ `ఫైనల్` అనే పదం తాజా చిత్రంలో ఉన్నప్పటికీ, ఇదే చివరిది కాకపోవచ్చు అని హింట్ ఇచ్చింది. కాబట్టి ఎంఐ 8 తర్వాతా వరుసగా సినిమాలు వచ్చే అవకాశం లేకపోలేదు. అంతే కాదు.. ఎంఐ 8 చిట్టచివరి సినిమానా కాదా? అనేదానికి టామ్ క్రూజ్ హింట్ అయితే ఇవ్వలేదు.
టామ్ క్రూజ్ దేనినీ ముగించే ఆలోచనను ఇష్టపడడని, చివరి రెండు సినిమాలు చేయడానికి 5 సంవత్సరాలు పట్టినా కానీ..ఫ్రాంఛైజీని కొనసాగించే ఆలోచనలను అన్వేషించవచ్చని చిత్ర తారాగణం అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులను నిరాశపరచరని కూడా వారు అన్నారు. అయితే టామ్ క్రూజ్ వయసు 62. ఈ వయసులో అతడు ఇంకా విమానాలపై నుంచి దూకుతూ, సాహసాలు చేయగలడా? ఇంకా రిస్కీ ఫైట్స్ చేస్తూ ప్రజలకు వినోదం అందించగలడా? అనేది ఆలోచించాలి. ఏజ్ లెస్ హీరోగా టామ్ ఇప్పటికీ ఫిట్ గా ఉన్నాడు. అతడు ఇంకా సాహసాలు చేయాలనుకుంటే అది అతడిలోని ముగింపు లేని గట్స్ కి నిదర్శనం.