Begin typing your search above and press return to search.

సూపర్‌ హిట్ సిరీస్ మూడో సీజన్‌ డేట్‌ ఫిక్స్‌

హిందీ వెబ్‌ సిరీస్ ల్లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ సిరీస్ గా నిలిచిన మీర్జాపూర్ కొత్త సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది

By:  Tupaki Desk   |   17 Jan 2024 6:37 AM GMT
సూపర్‌ హిట్ సిరీస్ మూడో సీజన్‌ డేట్‌ ఫిక్స్‌
X

హిందీ వెబ్‌ సిరీస్ ల్లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ సిరీస్ గా నిలిచిన మీర్జాపూర్ కొత్త సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే వచ్చిన మొదటి రెండు సీజన్ లు ఇండియన్ ఓటీటీ ప్రేక్షకులను అలరించిన విషయం తెల్సిందే. ఇప్పుడు మూడో సీజన్‌ అంతకు మించి అన్నట్లుగా రాబోతుందట.

అమెజాన్ ప్రైమ్‌ ద్వారా సిరీస్ రెండు సీజన్ లు కూడా స్ట్రీమింగ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రికార్డు స్థాయి లో వ్యూస్ ను సొంతం చేసుకునేందుకు గాను మీర్జాపూర్‌ సీజన్‌ 3 ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు స్పీడ్ గా రెడీ అవుతోంది.

మీర్జాపూర్‌ తొలి సీజన్‌ ను 2018 లో స్ట్రీమింగ్‌ చేయడం జరిగింది. మూడో సీజన్ కి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసిన యూనిట్‌ సభ్యులు ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు. మార్చి చివరి వారంలో స్ట్రీమింగ్‌ చేసేందుకు అమెజాన్ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

మొదటి రెండు సీజన్ లు ఒకదానితో మరోటి కనెక్షన్‌ ఉండే విధంగా సిరీస్‌ లు సాగాయి. మూడో సీజన్‌ లో ఏం ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇదే సమయంలో కొందరు మీర్జాపూర్‌ సిరీస్ యువతను తప్పుదోవ పట్టించే విధంగా ఉందంటూ విమర్శలు చేస్తున్నారు.

బూతులు, అసభ్య సన్నివేశాలు మీర్జాపూర్‌ నిండి ఉన్నాయి. కనుక అలాంటి సిరీస్ లకు కచ్చితంగా సెన్సార్‌ ఉండాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఎంతగా విమర్శలు వస్తాయో అంతగా సిరీస్ కి వ్యూస్ దక్కుతూ ఉంటాయి. ఈసారి అంతకు మించి అన్నట్లుగా బూతులు, ఆ సన్నివేశాలు ఉంటాయేమో చూడాలి.