Begin typing your search above and press return to search.

మిర్జాపూర్ అరాచ‌కాలపై ఎందుకింత ఆస‌క్తి?

హింస‌, ర‌క్త‌పాతం, బూతులు, అక్ర‌మ సంబంధాలు, గూండాయిజం .. ఇవన్నీ ఓటీటీ సిరీస్ మిర్జాపూర్ ప్ర‌త్యేక‌త‌లు

By:  Tupaki Desk   |   10 Nov 2023 5:12 PM GMT
మిర్జాపూర్ అరాచ‌కాలపై ఎందుకింత ఆస‌క్తి?
X

హింస‌, ర‌క్త‌పాతం, బూతులు, అక్ర‌మ సంబంధాలు, గూండాయిజం .. ఇవన్నీ ఓటీటీ సిరీస్ మిర్జాపూర్ ప్ర‌త్యేక‌త‌లు. వినేందుకు ఇబ్బందిక‌రంగా ఉన్నా కానీ ఈ సిరీస్ ఓటీటీల్లో ఒక సంచ‌ల‌నం. ఇప్ప‌టికే రెండు సీజ‌న్లుగా విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. అందుకే ఇప్పుడు సీజ‌న్ 3 రాక కోసం క‌ళ్లు కాయ‌లు కాసేలా వేచి చూస్తున్నారు యువ‌జ‌నం. అంత‌గా ఈ సిరీస్ లో ఏం క‌నెక్ట‌యింది? అంటే .. దీనిని రా-గా తెర‌కెక్కించిన విధానం, క‌ల్ట్ క్లాసిక్ గా మ‌లిచిన తీరు, ఆక‌ట్టుకునే క‌థ‌నం అని చెబుతారు. ఇప్పుడు సీజ‌న్ 3 కూడా మైమ‌రిపించే ట్విస్టులుంటాయ‌ని అంతా భావిస్తున్నారు.

ఓటీటీల్లో ఓవ‌ర్ డోస్ ఎక్కువ అవుతుంది అన్న విమ‌ర్శ‌లు ఎన్ని ఉన్నా కానీ మిర్జాపూర్ సిరీస్ నుంచి కొత్త సీజ‌న్ వ‌స్తోంది అన‌గానే ఒక‌టే ఉత్సాహం నెల‌కొంది. ఉత్కంఠ‌గా అంతా వేచి చూస్తుండ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ - మీర్జాపూర్ లోని ఒక కుటుంబం అరాచ‌కాల స్ఫూర్తితో తీసిన సినిమా ఇది. రియ‌లిస్టిక్ ఎప్రోచ్ లో స్క్రీన్ ప్లే ఎంతో ఆక‌ట్టుకుంటుంది.

ఇంత‌కుముందే అమెజాన్ ప్రైమ్ వీడియో ఇటీవల మీర్జాపూర్ 3కి సంబంధించిన అప్‌డేట్‌ను షేర్ చేసింది. ఇది వెబ్‌లో ర‌క‌రకాల ఊహాగానాలకు దారితీసింది. సీజ‌న్ 3 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని స్ప‌ష్ఠ‌మైంది. పంకజ్ త్రిపాఠి - అలీ ఫజల్ వంటి తార‌లతో టీజింగ్ క్లిప్‌లు ఇప్ప‌టికే వైర‌ల్ అయ్యాయి. మూడవ భాగం చిత్రీకర‌ణ‌లో ఉంది అని కానీ, షూటింగ్‌ను ముగించారని కాని ఇండికేష‌న్ వ‌చ్చింది. అయితే ఇప్పటి వరకు దీని రిలీజ్ డేట్‌పై ఎలాంటి అప్‌డేట్‌ను టీమ్ షేర్ చేయలేదు. వెబ్‌లో మీర్జాపూర్ 3కి సంబంధించిన చిన్న అప్‌డేట్ కోసం కూడా ఆసక్తిగా స్కాన్ చేస్తున్న అభిమానులను ఇది నిరాశకు గురి చేసింది.

ఒక రోజు క్రితం అమెజాన్ ప్రైమ్ వీడియో మీర్జాపూర్ 3కి సంబంధించిన అప్‌డేట్‌ను షేర్ చేసినప్పుడు అభిమానులు ఉప్పొంగిపోయారు. సిరీస్‌లోని మూడవ భాగం లేదా సిరీస్‌లోని పాత్రల ప‌రిచ‌యం గురించిన బిగ్ డేట్ ని వెల్లడించనప్పటికీ ఈ సిరీస్ లో పార్ట్ 3 నిర్మాణంలో ఉందని త్వరలో OTTలో విడుదల చేస్తార‌ని క్లారిటీ వ‌చ్చింది. అప్‌డేట్‌లో మీర్జాపూర్ 50 కిమీ అని సారి ఉన్న‌ ఒక మైలురాయిని చూపించారు. ఈ ట్వీట్ ఇంటర్నెట్‌లో కనిపించిన క్షణం ఫ్యాన్స్ ఉత్సాహం ప‌దింత‌లైంది. వారంతా ఆసక్తికరమైన వ్యాఖ్యలతో ముందుకు వచ్చారు. మిర్జాపూర్ 3కి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన నవంబర్ 19 నాటికి రెడీ చేస్తున్నార‌ని ఒక నెటిజన్ అంచనా వేశారు. అయితే ఈ సిరీస్ ఈ డిసెంబర్ చివరి నాటికి క్రిస్మస్ సెలవుల సీజన్‌లో విడుదలవుతుంద‌ని మరొక నెటిజ‌న్ రాశారు.

కొంతమంది మీర్జాపూర్ అభిమానులు ఇప్పటికీ సంతోషంగా లేరు. నిర్మాతలు సిరీస్ కి సంబంధించి క‌చ్చితమైన విడుదల తేదీని త్వరలో ప్ర‌క‌టించాలని కోరుతున్నారు. ఈ రెస్పాన్స్‌ని చూస్తుంటే ఒక విషయం పై క్లారిటీ వ‌చ్చింది. మీర్జాపూర్ 3 నిజానికి మోస్ట్ ఎవైటెడ్ ఇండియన్ ఓటీటీ ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఇది పెద్ద బ్యానర్ సినిమాల విడుదలకు సమానమైన హైప్‌ను సృష్టించింది.

ఈ సిరీస్‌లో పంకజ్ త్రిపాఠి - అలీ ఫజల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో రసిక దుగ్గల్, భువన్ అరోరా, రాజేష్ తైలాంగ్ త‌దిత‌రులు న‌టించారు. రెండవ సీజన్ ముగింపు లో.. కలీన్ భయ్యా (పంకజ్ త్రిపాఠి) నుండి గుడ్డు భయ్యా (అలీ ఫజల్) మీర్జాపూర్ లో ఆధిప‌త్యం చెలాయిస్తాడ‌నే ఊహాగానాలకు తెర తీసే హింట్ ఇచ్చారు. అధికారంతో ఆధిపత్యాన్ని చెలాయించేందుకు మ‌ళ్లీ చాలా పోరాటాలు, దౌత్యం, డ్రామాలను చూసేందుకు ఆస్కారం ఉంద‌ని స్ప‌ష్ఠ‌త వ‌చ్చింది.