మీర్జాపూర్ మూవీ గురించి పంకజ్ ఏమంటున్నారంటే
ఇండియన్ ఓటీటీ హిస్టరీలోనే ఎక్కువ వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్ గా మీర్జాపూర్ సిరీస్ ప్రత్యేకంగా నిలిచింది.
By: Tupaki Desk | 4 July 2025 7:00 PM ISTఇండియన్ ఓటీటీ హిస్టరీలోనే ఎక్కువ వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్ గా మీర్జాపూర్ సిరీస్ ప్రత్యేకంగా నిలిచింది. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో బోల్డ్ కంటెంట్ తో రూపొందిన ఈ వెబ్ సిరీస్ మంచి క్రేజ్ అందుకుంది. ఇప్పటికే మీర్జాపూర్ 3 సిరీస్ లు రాగా అందులో మున్నా భయ్యా, త్రిపాఠీ పాత్రలు ఆడియన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ కు నాలుగో సీజన్ కూడా రూపొందుతుంది. అయితే మీర్జాపూర్ వెబ్ సిరీస్ ను మీర్జాపూర్ ది ఫిల్మ్ పేరిట సినిమాగా తీసుకురానున్నట్టు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేయగా, తాజాగా నటుడు పంకజ్ త్రిపాఠి ఈ సినిమాపై అప్డేట్ ఇచ్చారు. మీర్జాపూర్ సినిమాలో కాలీన్ భయ్యా క్యారెక్టర్ లో పంకజ్ త్రిపాఠి కనిపించనున్నారు.
ఈ సినిమా ఎప్పుడు మీ ముందుకొస్తుందో కచ్ఛితంగా చెప్పలేనని, ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లొచ్చానని, మీర్జాపూర్ మూవీ గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, ఈ సినిమా గురించి తాను కచ్ఛితంగా ఒకటి మాత్రమే చెప్పగలనని, మరో నెలలో మీర్జాపూర్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తాను స్ట్రాంగ్ గా నమ్ముతున్నట్టు చెప్పారు.
పంకజ్ త్రిపాఠి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీర్జాపూర్ వెబ్‌సిరీస్ ను సృష్టించిన పునీత్ కృష్ణ ఈ సినిమాకు కథను అందించనుండగా, గుర్మీత్‌సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేస్తామని నిర్మాత ఇప్పటికే అనౌన్స్ చేసింది. ఓటీటీలో మీర్జాపూర్ సిరీస్ ఎంత హిట్ అయిందో మీర్జాపూర్ సినిమా కూడా అంతే హిట్ అవుతుందని అందరూ అభిప్రాయ పడుతున్నారు.
