Begin typing your search above and press return to search.

అడ‌వి శేషుతో ఆ నిర్మాత అలాంటి అటెంప్ట్!

యంగ్ హీరో అడ‌వి శేష్ డిఫ‌రెంట్ అటెంప్స్ట్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స్పై యాక్ష‌న్ చిత్రాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కించుకున్న న‌టుడు

By:  Tupaki Desk   |   27 Sep 2023 10:30 AM GMT
అడ‌వి శేషుతో ఆ నిర్మాత అలాంటి అటెంప్ట్!
X

యంగ్ హీరో అడ‌వి శేష్ డిఫ‌రెంట్ అటెంప్స్ట్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స్పై యాక్ష‌న్ చిత్రాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కించుకున్న న‌టుడు. అత‌డి నుంచి ఎలాంటి సినిమా వ‌చ్చినా! అందులో వైవిథ్య‌త ఉంటుంద‌ని ప్రేక్ష‌కుల్లో బ‌లంగా ముద్ర ప‌డిపోయింది. అత‌డు ఇప్పుడు అదే కంప‌ర్ట్ జోన్ లో కొన్నాళ్ల పాటు జ‌ర్నీ చేయాల‌నుకుంటున్నాడు. స‌క్సెస్ ఉన్న‌ప్పుడు ఎందుకు వ‌దిలేయ‌డం! అన్న తీరులు కొత్త త‌ర‌హా కథ‌ల‌కే ప్రాధాన్య‌త ఇస్తున్నాడు.

అయితే ఆ ఇమేజ్ ని దాటొచ్చి సినిమాలు చేయాల‌ని ఉంది. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌లే ఓ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ చేస్తున్న‌ట్లు రివీల్ చేసాడు. ఆ ప్రాజెక్ట్ పూర్తి వివ‌రాలు ఇంకా రివీల్ చేయ‌లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా నిర్మాత ..ద్వార‌కా క్రియేష‌న్స్ అధినేత మిర్యాల ర‌వీంద్ రెడ్డి ...అడవి శేష్ తో ఓ సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మించ‌బోయే సినిమా ఇదేనా? లేక మ‌రో కొత్త కాన్సెప్ట్ ని నిర్మిస్తున్నారా? అన్న డౌట్ రెయిజ్ అవుతోంది.

'సాహ‌సం శ్వాస‌గా సాగిపో' చిత్రంతో ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మిత‌గా ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత 'య‌మ‌న్'..'జ‌య‌జాన‌కి నాయ‌క‌'..'చిన‌బాబు'..'అఖండ' లాంటి సినిమాలు నిర్మించారు. వాటిలో 'అఖండ' త‌ప్ప మిగ‌తా సినిమాలేవి నిర్మాత‌కి లాభాలు తెచ్చిన చిత్రాలు కాదు. ప్ర‌స్తుతం పెద‌కాపు ని రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ సంద‌ర్భంగానే శేష్ తో సినిమా చేస్తున్న విష‌యాన్ని రివీల్ చేసారు.

అయితే ఆ సినిమా శేషు ర‌వీల్ చేసిన‌ట్లు రొమాంటిక్ సినిమా అవుతుందా? లేక ర‌వీంద‌ర్ తో కొత్త ప్ర‌య‌త్నం చేయిస్తున్నారా? అన్న‌ది ఆస‌క్తిక‌రం. న‌ష్ట‌-లాభాల‌తో సంబంధం లేకుండా ర‌వీంద‌ర్ రెడ్డి సినిమాలు చేస్తున్నారు. దాదాపు ఎనిమిదేళ్ల నుంచి ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతున్నారు. నిర్మాణం విష‌యంలో ఆయ‌న ఎక్క‌డా రాజీ ప‌డ‌రు. నాగ‌ చైత‌న్య‌..బాల‌కృష్ణ‌..కార్తీ లాంటి స్టార్ల‌తో సినిమాలు నిర్మించిన ఘ‌న‌త సొంతం.