మృణాల్ అందానికి మిర్రర్ ముక్కలు
మృణాల్ నెక్ట్స్ ఏంటి? అంటే.. హాయ్ నాన్న తర్వాత దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ లో నటిస్తోంది
By: Tupaki Desk | 30 Jan 2024 10:12 AM ISTఅద్దంలో అందం ముక్కలైంది.. కుర్రకారు గుండె చెక్కలైంది..!! ఇదిగో ఇక్కడ దృశ్యం అలానే ఉంది. అందంగా లేనా అసలేం కానా..! అంటూ అద్దంలోకి తీక్షణంగా చూసింది మృణాల్. ఆ తీక్షణతకు అద్దం ముక్క చెక్కలైంది. ముక్క చెక్కలైన ఆ అద్దంలో అందాన్ని చూసి కుర్రకారు గుండె ముక్కలైంది. ప్రస్తుతం ఈ అందమైన ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది. అలా చెవిలోలాకులు అద్దంలో చూసుకునేందుకు ఇంతటి తీక్షణత అవసరమా? అంటూ మృణాల్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ బ్యూటీ డిజైనర్ లుక్ యూత్ ని కిల్ చేస్తోంది.
మృణాల్ నెక్ట్స్ ఏంటి? అంటే.. హాయ్ నాన్న తర్వాత దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ లో నటిస్తోంది. సీతా రామం- హాయ్ నాన్నా అనే రెండు బ్యాక్-టు-బ్యాక్ హిట్‌లలో నటించిన మృణాల్ విజయ్ దేవరకొండ సరసన అవకాశం రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. తన కొత్త చిత్రం ఫ్యామిలీ స్టార్ లో మృణాల్ పాత్ర దాదాపు చిత్రీకరణ పూర్తయింది. ఫ్యామిలీ స్టార్ అనేది ఎమోషనల్ మూమెంట్స్‌తో కూడిన సాధారణ ఫ్యామిలీ డ్రామా. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫ్యామిలీ స్టార్ రెండు భాగాలలో ఉల్లాసమైన కామెడీతో నిండి ఉందని మృణాల్ వెల్లడించారు. ఆమె మరియు విజయ్ నటించిన కామెడీ సన్నివేశాలు చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయని మృణాల్ చెప్పారు.
ఫ్యామిలీ స్టార్ పూర్తి వినోదాత్మక సినిమా. ఈ చిత్రం కమర్షియల్ అంశాలతో పాటు, నిజమైన విలువలతో రూపొందుతోంది. అందరూ కమర్షియల్ సినిమా చేస్తున్నారు కానీ మీరు దాని నుండి ఏమి నేర్చుకుంటున్నారు? అని ప్రశ్నిస్తే దానికి సమాధానం దీనిలో దొరుకుతుంది. గీత గోవిందం సినిమాకి దర్శకత్వం వహించిన పరశురామ్‌గారితో కలిసి పని చేయాలని చాలా ఆతృతగా ఎదురుచూసాను. అతడు అందమైన రచయిత కూడా.. అతడు మాత్రమే రాయగలిగే కొన్ని అద్భుతాలు ఉన్నాయి. అతడి అతిపెద్ద ఆయుధం అతడి రచనా నైపుణ్యం అని నేను అనుకుంటున్నాను. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ 5 ఏప్రిల్ 2024న విడుదలకు సిద్ధంగా ఉంది.
హాయ్ నాన్నలో తన నటనకు ప్రశంసలు అందుకుంటున్న మృణాల్ బ్యాక్ టు బ్యాక్ టాలీవుడ్ లో క్రేజీ అవకాశాలు అందుకుంటోంది. హిందీ పరిశ్రమ కంటే ప్రస్తుతం తెలుగు చిత్రసీమపైనే ఈ అమ్మడు దృష్టి సారించింది.
