Begin typing your search above and press return to search.

ఓజీ తో కుర్ర హీరో సినిమా పోలిక..!

ఓజీ మరియు మిరాయ్ పాత్రలు కాస్త దగ్గర దగ్గర ఉన్నా కూడా సినిమాలు పూర్తి విభిన్నంగా ఉంటాయి అన్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెప్పుకొచ్చారు.

By:  Tupaki Desk   |   18 April 2024 10:01 AM GMT
ఓజీ తో కుర్ర హీరో సినిమా పోలిక..!
X

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్నింటిలోకి ఓజీ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాహో సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఓజీ'. ఇంకా అధికారికంగా టైటిల్ ను ఖరారు చేయలేదు. అయినా కూడా సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.

పవన్ కళ్యాణ్‌ రాజకీయాల కారణంగా బిజీగా ఉండటంతో ఓటీ సినిమా షూటింగ్‌ ఆగిపోయింది. ఈ ఏడాది జులై లేదా ఆగస్టు నుంచి మళ్లీ ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మరోసారి ఓజీ సినిమా గురించి చర్చ జరుగుతోంది.

హనుమాన్ సినిమాతో హిట్ కొట్టిన కుర్ర హీరో తేజా సజ్జా హీరోగా 'మిరాయ్‌' అనే సినిమా రూపొందుతోంది. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ ను విడుదల చేయడం జరిగింది. సినిమా టైటిల్ మరియు ఇతర విషయాలను చూస్తూ ఉంటే ఓజీ ని పోలి ఉన్నట్లుగా అనిపిస్తుంది.

ఆ విషయాన్ని తేజ సజ్జా కూడా ఒప్పుకున్నాడు. ఆయన మాట్లాడుతూ... మిరాయ్ అనే సూపర్‌ యోధా టైటిల్‌ ను నేను టాలీవుడ్‌ లో అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇస్తాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఓజీ గ్లిమ్స్ లో పవన్‌ కళ్యాణ్ గారు కత్తి పట్టి తిప్పడం, ఆ టైటిల్ ఫాంట్‌ అన్నీ కూడా మా మిరాయ్ సినిమా కు దగ్గరగా ఉంటాయి.

ఓజీ మరియు మిరాయ్ పాత్రలు కాస్త దగ్గర దగ్గర ఉన్నా కూడా సినిమాలు పూర్తి విభిన్నంగా ఉంటాయి అన్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెప్పుకొచ్చారు. మిరాయ్‌ సినిమాలో తేజా సజ్జా ను మరోసారి సూపర్ హీరోగా చూడబోతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.