Begin typing your search above and press return to search.

మిరాయ్.. ట్రెండ్ సెట్ చేస్తున్నాడుగా

హనుమాన్ సీక్వెల్ లో కూడా తేజ సజ్జా నటించనున్నారు. అయితే ఆ సినిమాలో హనుమంతుడిదే ముఖ్యపాత్ర అని ఇప్పటికే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రకటించారు.

By:  Tupaki Desk   |   18 April 2024 3:15 PM GMT
మిరాయ్.. ట్రెండ్ సెట్ చేస్తున్నాడుగా
X

యంగ్ హీరో తేజ సజ్జా.. హనుమాన్ మూవీతో ఈ కుర్రాడి రేంజే మారిపోయింది. సంక్రాంతికి విడుదలైన ఆ చిత్రం.. పాన్ ఇండియా లెవెల్ లో భారీ హిట్ అయిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు బద్దలు కొడుతూ కొత్తవి కూడా క్రియేట్ చేసింది. మేకర్స్ కు భారీ లాభాలు తెచ్చి పెట్టడమే కాకుండా.. తేజ క్రేజ్ ను నేషనల్ వైడ్ గా పెంచేసింది. దీంతో ఈ యువ కథానాయకుడు నటించే కొత్త సినిమాలపై అందరి దృష్టి పడింది.


హనుమాన్ సీక్వెల్ లో కూడా తేజ సజ్జా నటించనున్నారు. అయితే ఆ సినిమాలో హనుమంతుడిదే ముఖ్యపాత్ర అని ఇప్పటికే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రకటించారు. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ కాగా, త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. అయితే హనుమాన్ కన్నా ముందే సైన్ చేసిన మిరాయ్ చిత్రాన్ని ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారు తేజ. ఈ హిస్టారికల్ మూవీ టైటిల్ గ్లింప్స్ ను మేకర్స్ గురువారం ఉదయం రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

మిరాయ్ మూవీ మేకింగ్ వేరే లెవెల్ లో ఉండబోతుందని గ్లింప్స్ చూస్తేనే ఈజీగా తెలిసిపోతోంది. సినిమాలో గ్రాఫిక్స్ ప్రేక్షకులను వేరే లోకంలోకి తీసుకెళ్లడం పక్కాగా కనిపిస్తోంది. గ్లింప్స్ లో పోరాటాలు ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన మిరాయ్ గ్లింప్స్.. నేషనల్ వైడ్ గా అన్ని భాషల్లో ట్రెండింగ్ నెం.1 గా నిలిచింది. అన్ని వర్గాల సినీ ఆడియన్స్ నుంచి గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

గ్లింప్స్ లోని విజువల్స్ కు సినీ ప్రియులు ఫిదా అయిపోతున్నారు. రీసెంట్ టైమ్ లో బెస్ట్ టీజర్ కట్ ఇదేనంటూ కొనియాడుతున్నారు. సినిమా కంటెంట్ అదిరిపోయేలా ఉండనున్నట్లు అర్థమవుతోందని అంటున్నారు. పోరాటాలు ఆకట్టుకుంటున్నట్లు చెబుతున్నారు. హనుమాన్ తర్వాత మరో విజువల్ ఫీస్ట్ గా మిరాయ్ సినిమా ఉంటుందని ఆశిస్తున్నారు. ఓవరాల్ గా గ్లింప్స్ అదరహో అంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఈ సినిమాలో అశోకుడిని యోగిగా మార్చిన ఓ అపార గ్రంథాన్ని కాపాడే యోధుడిగా తేజ సజ్జా కనిపించనున్నారు. గ్లింప్స్ లో పోరాట యోధుడిగా తనదైన విన్యాసాలతో ఆకట్టుకున్నారు ఈ యంగ్ హీరో. హనుమాన్ తర్వాత ఈ మూవీ ద్వారా మరో బ్లాక్ బస్టర్ హిట్ తేజకు దక్కుతుందని అందరూ అంటున్నారు. ఈ సినిమాతో తేజ సజ్జా పేరు మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో మార్మోగడం పక్కా అని చెబుతున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.