Begin typing your search above and press return to search.

మిరాయ్ మేక‌ర్స్ డెసిష‌న్ క‌రెక్టే!

మొన్నా మ‌ధ్య ఎన్టీఆర్ నుంచి వ‌చ్చిన దేవ‌ర‌లో దావూది పాట‌ను అలానే లేపేశారు. గేమ్ ఛేంజ‌ర్ లో కొన్ని కోట్లు పెట్టిన తీసిన సాంగ్ ను కూడా ఎడిటింగ్ లో డిలీట్ చేశారు.

By:  Tupaki Desk   |   12 Sept 2025 5:18 PM IST
మిరాయ్ మేక‌ర్స్ డెసిష‌న్ క‌రెక్టే!
X

చాలా సినిమాల‌కు సాంగ్స్ తోనే హైప్ వ‌స్తుంద‌ని అంటుంటారు. అదే నిజం కూడా. ఆడియ‌న్స్ ను థియేట‌ర్ల‌కు రప్పించే సాధ‌నాలు సాంగ్సే. మూవీపై అంచ‌నాలు పెర‌గ‌డానికి, ఒక్కోసారి త‌గ్గ‌డానికి కూడా అవి కార‌ణ‌మ‌వుతూ ఉంటాయి. అందుకే సాంగ్స్ షూటింగ్‌కే కాకుండా వాటి మేకింగ్ వీడియోల కోసం కూడా నిర్మాత‌లు భారీగా ఖ‌ర్చు పెడుతూ వ‌స్తున్నారు.

అయితే ఎంత ఖ‌ర్చు పెట్టి తీసిన పాటైనా స‌రే సినిమాకు అడ్డుగా ఉంటే దాన్ని నిర్మొహ‌మాటంగా ఎడిటింగ్ లో లేపేస్తున్నారు. క‌థ‌కు అడ్డొస్తుంద‌నో, అన‌వ‌స‌రంగా సాంగ్ ను ఇరికించిన‌ట్టు అవుతుంద‌నో లేదా ర‌న్ టైమ్ ఎక్కువ అవుతుంద‌నో, మొత్తానికి ఏదొక కార‌ణంతో కొన్ని సినిమాల్లో నుంచి మంచి సాంగ్స్ ను తీసేస్తున్నారు. అలా ఇప్ప‌టికే చాలా హిట్ సాంగ్స్ సినిమాలో స్పేస్ కు నోచుకోలేదు.

మొన్నా మ‌ధ్య ఎన్టీఆర్ నుంచి వ‌చ్చిన దేవ‌ర‌లో దావూది పాట‌ను అలానే లేపేశారు. గేమ్ ఛేంజ‌ర్ లో కొన్ని కోట్లు పెట్టిన తీసిన సాంగ్ ను కూడా ఎడిటింగ్ లో డిలీట్ చేశారు. రీసెంట్ గా విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా వ‌చ్చిన కింగ్‌డ‌మ్ సినిమాలో హీరోహీరోయిన్ల మ‌ధ్య వ‌చ్చే డ్యూయెట్ ను కూడా అలానే తీసేశారు. ఇప్పుడ‌లానే మ‌రో హిట్ సాంగ్ కు మేక‌ర్స్ సినిమాలో చోటివ్వ‌లేదు.

హిట్ సాంగ్ కు చోటు లేదు

అదే తేజ స‌జ్జా హీరోగా వ‌చ్చిన తాజా సినిమా మిరాయ్ లోని వైబ్ ఉంది సాంగ్. ఈ పాట రిలీజైన‌ప్పుడు అందులో తేజ‌- రితిక మ‌ధ్య కెమిస్ట్రీ, ఆ స్టెప్పులు, ట్యూన్ అన్నింటికీ ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కానీ ఇప్పుడు ఆ సాంగ్ ను సినిమాలో ఉంచ‌లేదు. దాదాపు 3 గంట‌ల ర‌న్ టైమ్ ఉన్న సినిమా నుంచి ఈ సాంగ్ ను డిలీట్ చేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

అయితే మిరాయ్ సినిమా విష‌యంలో ఆ సాంగ్ ను డిలీట్ చేసి మేక‌ర్స్ మంచి డెసిష‌నే తీసుకున్నారు. డివోష‌న్, యాక్ష‌న్ మిక్డ్స్ మూవీగా వ‌చ్చిన మిరాయ్ లో హీరోయిన్ ఉన్న‌ప్ప‌టికీ డైరెక్ట‌ర్ స్పెష‌ల్ గా ల‌వ్ ట్రాక్ పెట్ట‌లేదు. ల‌వ్ ట్రాక్ పెడితే సినిమా, క‌థ ఎక్క‌డ ప‌క్క దారి ప‌డుతుందోన‌ని భావించి డైరెక్ట‌ర్ అనుకున్న పాయింట్ మీదే ముందుకెళ్లారు త‌ప్పించి ఎక్క‌డా ప‌క్క‌చూపులు చూడ‌లేదు. ఒక‌వేళ ఆడియ‌న్స్ ఆశించిన‌ట్టు మిరాయ్ లో వైబ్ ఉంది సాంగ్ ను ఎక్క‌డో ఒక చోట పెట్టి ఉంటే క‌చ్ఛితంగా అది మ‌ధ్య‌లో ఓ స్పీడు బ్రేక‌ర్ లాగానో, ఏదో కావాల‌ని ఇరికించిన‌ట్టు ఉండేది త‌ప్పించి సిట్యుయేష‌న్ లో భాగంగా మాత్రం అనిపించ‌దు. కుదిరితే త‌ర్వాతేమైనా మేక‌ర్స్ ఆ సాంగ్ ను యాడ్ చేసే ప్ర‌య‌త్నం చేస్తారేమో కానీ ఇప్పుడు మాత్రం మిరాయ్ మూవీకి మేక‌ర్స్ ఆ వైబ్ ను యాడ్ చేయ‌రు.