Begin typing your search above and press return to search.

'విశ్వంభ‌ర‌'లో మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్ ఇదే

ఇందులో చిరంజీవి పాత్ర లార్జ‌ర్ దేన్ లైఫ్ పంథాలో ఉంటుంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపించాయి.

By:  Tupaki Desk   |   30 April 2024 1:30 AM GMT
విశ్వంభ‌ర‌లో మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్ ఇదే
X

'భోళా శంకర్' తర్వాత చిరంజీవి తన 156వ సినిమా 'విశ్వంభర' కోసం తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. వశిష్ట ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఫాంటసీ డ్రామా చిత్రంలో దొరబాబు అనే పాత్ర‌లో చిరు క‌నిపిస్తార‌ని ఇప్ప‌టికే టాక్ ఉంది. ఇందులో చిరంజీవి పాత్ర లార్జ‌ర్ దేన్ లైఫ్ పంథాలో ఉంటుంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపించాయి. చిరుని భిన్నమైన కోణంలో చూపించే చిత్ర‌మిది.

ఈ చిత్రం నవంబర్ 2023లో సెట్స్‌పైకి వెళ్లింది. ఇప్ప‌టికే విశ్వంభ‌ర టైటిల్ ని లాంచ్ చేయ‌గా దానికి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. యువి క్రియేష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని దాదాపు 150 కోట్ల నుండి 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మిస్తోందని గుస‌గుస‌లు వినిపిస్తున్నారు. ఇటీవ‌ల చిరు ద్విపాత్రాభిన‌యం చేస్తార‌ని కూడా టాక్ లీకైంది.

తాజా స‌మాచారం మేర‌కు .. ఇందులో ఇంట‌ర్వెల్ యాక్ష‌న్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుంద‌ని, ఈ సీక్వెన్స్ లో చిరు రెండో పాత్ర‌ను కూడా రివీల్ చేస్తార‌ని తెలిసింది. ఇక ఇదే సీన్ లో ఫ్యామిలీ ఎమోష‌న్స్ ని ర‌క్తి క‌ట్టించే విధంగా తీర్చిదిద్ద‌నున్నార‌ని లీకులు అందుతున్నాయి. జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి త‌ర‌హా ఎమోష‌న‌ల్ అంశాలు ఈ చిత్రంలో కూడా ఉన్నాయని గుస‌గుస వినిపిస్తోంది.

తాజా షెడ్యూల్‌ లో త్రిష - చిరు జంట‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ద్విపాత్ర‌ల్లో చిరు న‌ట‌న హైలైట్ గా ఉంటుంది. ఫ్యాన్స్ కి కావాల్సిన అన్ని అంశాలు పుష్క‌లంగా ఉంటాయి. అలాగే త్రిష మునుపెన్న‌డూ క‌నిపించ‌నంత ప్ర‌త్యేకంగా క‌నిపిస్తుంద‌ని కూడా చెబుతున్నారు. విశ్వంభరకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం 10 జనవరి 2025న విడుదల కానుంది. చిరంజీవి తన తదుపరి చిత్రానికి బోయపాటి శ్రీనుతో సైన్ అప్ చేసారు. త్వరలోనే ఇది సెట్స్ పైకి వెళుతుంద‌ని తెలిసింది.