Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మ‌ల్లా దెబ్బ‌కు మైండ్ బ్లాక్

సిజ్లింగ్ బ్రాలెట్ మినీ స్కర్ట్ ధరించి మలైకా పార్టీలోకి ప్రవేశిస్తున్న ఫోటోలు వీడియోలు గుబులు రేపుతున్నాయి.

By:  Tupaki Desk   |   28 Jan 2024 5:30 PM GMT
ఫోటో స్టోరి: మ‌ల్లా దెబ్బ‌కు మైండ్ బ్లాక్
X

ఇండ‌స్ట్రీ ఐట‌మ్‌ గాళ్ మలైకా అరోరా ఏ వేదిక మీద క‌నిపించినా హెడ్ ట‌ర్న‌ర్ గా నిలుస్తుంది. ఇప్పుడు జోనాస్ బ్రదర్స్ ఆఫ్టర్ పార్టీలో అదిరిపోయే లుక్ తో కనిపించింది. సిజ్లింగ్ బ్రాలెట్ మినీ స్కర్ట్ ధరించి మలైకా పార్టీలోకి ప్రవేశిస్తున్న ఫోటోలు వీడియోలు గుబులు రేపుతున్నాయి.


ప్ర‌తిసారీ షో స్టాప‌ర్ మ‌లైకా రూపం చ‌ర్చ‌నీయాంశ‌మే. ఈసారి కూడా మలైకా లుక్ ఈ వేదిక వ‌ద్ద చ‌ర్చ‌గా మారింది. లైట్ డెనిమ్ బ్లేజర్ లో చంకీ ఆభ‌ర‌ణాలతో అదిరిపోయే రూపంలో ప్ర‌త్య‌క్ష‌మైన మ‌లైకా టూ హాట్ గా క‌నిపించింది. ఆస‌క్తిక‌రంగా చేతిలో ఒక బంగారు వ‌ర్ణం ఛ‌మ్కీల‌ బ్యాగ్ తో స్టైలిష్ గా క‌నిపించిన మ‌లైకా కెమెరాల ముందు షైనీ చిరునవ్వులతో మ‌తులు చెడ‌గొట్టింది.

నిక్ జోనాస్ అత‌ని సోదరులు, కెవిన్ -జో శనివారం సాయంత్రం ముంబైలోని లోల్లపలూజా ఇండియాలో వేదికపై క‌చేరీలో క‌నిపించారు. ఇది భారతదేశంలో వారి మొట్టమొదటి సంగీత కచేరీ. ఈ కచేరీ తర్వాత ప్రియాంక సన్నిహితురాలు నటాషా పూనావల్లా వారి కోసం ప్ర‌త్యేకించి ఒక పార్టీని నిర్వ‌హించింది. ఈ పార్టీలో మలైకాతో పాటు, మాధురీ దీక్షిత్, ఆమె భర్త డాక్టర్ శ్రీరామ్ నీనే, అదితి రావ్ హైదరీ, సోనమ్ కపూర్, ఆనంద్ అహూజా స‌హా ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

మ‌లైకా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ గురించి ప్ర‌స్థావిస్తే.. ఈ బ్యూటీ అర్జున్ కపూర్ నుంచి విడిపోవడంపై చాలా ఊహాగానాలు వ్యాపించాయి. ఫరా ఖాన్‌తో కలిసి ఝలక్ దిఖ్లా జా న్యాయనిర్ణేతగా పనిచేస్తున్న మలైకా ఇటీవలి ఎపిసోడ్‌లో తన సింగిల్ స్టేటస్ గురించి మాట్లాడింది. అలాగే పునర్వివాహం గురించి కూడా ధీమా వ్యక్తం చేసింది. దీనికి కార‌ణం మ‌లైకా మాజీ భర్త అర్బాజ్ ఖాన్, మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్ ని పెళ్లాడ‌ట‌మేన‌ని భావించాల్సి ఉంటుంది. బ్రేకప్ గురించి వారి నుండి అధికారిక ప్రకటన రానప్పటికీ అర్జున్ క‌పూర్ ఇప్పుడు కుశ కపిలతో డేటింగ్ చేస్తున్నాడని పుకార్లు ఉన్నాయి. ఇంత‌కుముందు కరణ్ జోహార్ ఇంట్లో జరిగిన పార్టీలో వారు కలిసి కనిపించారు. ఈవెంట్ నుండి వారి ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే ఈ బ్రేకప్ పుకార్లకు విరుద్ధంగా మలైకా - అర్జున్ లంచ్ అండ్ డిన్నర్ డేట్‌లలో కలిసి కనిపించారు.