Begin typing your search above and press return to search.

నా గురించి అడుగుతాడని వాళ్లు నాన్న ఫోన్‌ ఎత్తలేదు..!

బాలీవుడ్‌ స్టార్‌ నటుడు మిథున్ చక్రవర్తి తనయుడు మిమోహ్‌ చక్రవర్తి సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం క్రితమే అడుగు పెట్టాడు.

By:  Tupaki Desk   |   9 April 2025 2:30 PM
నా గురించి అడుగుతాడని వాళ్లు నాన్న ఫోన్‌ ఎత్తలేదు..!
X

సినిమా ఇండస్ట్రీలో వారసత్వం అనేది కామన్‌ విషయం. స్టార్‌ కిడ్స్ హోదాలో ఇండస్ట్రీలో అడుగు పెట్టడం పెద్ద కష్టం ఏమీ కాదు. కానీ ఆ స్టార్‌ కిడ్‌ హోదాతో స్టార్డం దక్కడం అనేది కష్టమైన విషయం. సోషల్‌ మీడియాలో స్టార్ కిడ్స్‌కి మంచి ఫాలోయింగ్‌ ఉంటుంది. అదే సమయంలో సినిమా ఇండస్ట్రీలో రాణించలేక పోతే కచ్చితంగా భారీ ట్రోల్స్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్టార్‌ కిడ్స్ ఎంతో మంది ఇండస్ట్రీలో అడుగు పెడతారు. కానీ వారిలో సక్సెస్ అయ్యే వారు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఎక్కువ శాతం మంది కొన్నాళ్లు సినిమాలు చేసి ఆ తర్వాత కనిపించకుండా పోతున్నారు. కొందరు మాత్రం సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.

బాలీవుడ్‌ స్టార్‌ నటుడు మిథున్ చక్రవర్తి తనయుడు మిమోహ్‌ చక్రవర్తి సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం క్రితమే అడుగు పెట్టాడు. 2008లో జిమ్మీ అనే సినిమాలో నటించడం ద్వారా ఇండస్ట్రీకి మిమోహ్‌ పరిచయం అయిన విషయం తెల్సిందే. ఆ సమయంలో మిమోహ్‌ ఇండస్ట్రీలో స్టార్‌గా ఎదగడం ఖాయం అని అంతా భావించారు. కానీ ఆయనకు ఆశించిన స్థాయిలో సక్సెస్‌ దక్కలేదు. కెరీర్‌ ఆరంభంలోనే ఆయన నటించిన సినిమాలు విడుదల కాకపోవడం, కొన్ని సినిమాలు షూటింగ్‌ ప్రారంభం అయిన తర్వాత ఆగి పోవడం జరిగింది. దాంతో ఒకానొక సమయంలో మిమోహ్‌ సినీ కెరీర్‌పై పలు రకాలుగా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. నటుడిగా ఈయన కొనసాగడం కష్టం అని అంతా అనుకున్నారు.

ఎంత ప్రతికూల పరిస్థితులు ఎదురు అయినా మిమోహ్‌ మాత్రం తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే వచ్చాడు. ఎట్టకేలకు ఆయనకు ఖాకీ: ది బెంగాల్ చాప్టర్ తో మంచి గుర్తింపు దక్కింది. నటుడిగా మిమోహ్‌ కి మంచి గుర్తింపు దక్కింది. అంతేకాకుండా ముందు ముందు ఆయన కీలక పాత్రల్లో నటించే అవకాశాలు దక్కించుకోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తాజాగా ఖాకీ: ది బెంగాల్ చాప్టర్ వెబ్‌ సిరీస్ ప్రమోషన్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాక్యలు చేశాడు. తన కెరీర్‌ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో చాలా మంది మొహం చాటేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు మాత్రమే కాకుండా తన తండ్రికి సైతం ఆ సమయంలో కొందరు మొహం చూపించలేదని మిమోహ్‌ అన్నాడు.

ఆయన మాట్లాడుతూ... చాలా మంది నా గురించి అడుగుతాడని, నాకు ఆఫర్‌ ఏమైనా ఇవ్వమని అడుగుతాడని మా నాన్న మిథున్ చక్రవర్తి ఫోన్‌లు సైతం ఎత్తని సందర్భం ఉంది. ఆ రోజుల్లో నా తండ్రిని సైతం చాలా మంది అవమానించారు. చివరకు కాస్టింగ్‌ డైరెక్టర్‌లు నాకు టీవీ షో ఆడిషన్స్ కోసం పంపించారు. ప్రతి ఒక్కటి భరిస్తూ వచ్చాను. చాలా సార్లు కెరీర్‌పై అపనమ్మకం ఏర్పడినా కూడా ప్రయత్నాలు కొనసాగిస్తూ వచ్చాను. నటనపై ఆసక్తి కారణంగానే తాను ఈ రోజు ఇంకా ఇండస్ట్రీలో ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. తన తండ్రి పేరును వాడుకోవాలని తాను ఎప్పుడు అనుకోను అని అన్నాడు.