Begin typing your search above and press return to search.

మిహికా రానా గ్లామర్ డోస్.. స్టన్నింగ్!

తాజాగా మిహికా దగ్గుబాటి ఇన్ స్టాగ్రామ్ లో పింక్ కలర్ షార్ట్ ష్కట్ తో అదిరిపోయే ఫోటోని షేర్ చేసుకున్నారు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది

By:  Tupaki Desk   |   13 Sep 2023 5:15 AM GMT
మిహికా రానా గ్లామర్ డోస్.. స్టన్నింగ్!
X

మన స్టార్ హీరోలకి సోషల్ మీడియాలో ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో అందరికి తెలిసిందే. అయితే స్టార్ హీరోల భార్యలు మాత్రం గతంలో అస్సలు బయటకి వచ్చేవారు కాదు. మీడియాకి దూరంగా ఉండేవారు. అయితే మారుతున్న కాలంతో పాటుగా ట్రెండ్ కి తగ్గట్లు వారు అప్డేట్ అవుతూ ఉన్నారు. సెలబ్రెటీల భార్యలు కూడా అదే ఇమేజ్ ని ఆశ్వాదించడానికి ఇష్టపడుతున్నారు.


హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని అందంతో సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉన్నారు. ఫ్యామిలీ లైఫ్ కి సంబందించిన ఫోటోలని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూనే అప్పుడప్పుడు తమలోని గ్లామర్ ని కూడా బయటకి తీసుకొస్తున్నారు. టాలీవుడ్ ఎక్కువ పాపులారిటీ ఉన్న సెలబ్రెటీ భార్యలలో అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి ముందుంటారు. ఆమె తనకి సంబందించిన ప్రతి మూమెంట్ ని ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంటారు.

అలాగే దగ్గుబాటి రానా భార్య మిహికా కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆమె ఇప్పటికే ఇంటీరియర్ డిజైనర్ గా మంచి పాపులారిటీ ఉన్న వ్యక్తి. రానా, మిహికా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలలో టాప్ ఇంటీరియర్ డిజైనర్స్ లో మిహికా కూడా ఒకరు. అందుకే ఆమె ఫ్యాషన్ ప్రపంచంలోనే ఉంటారు. కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉంటారు.

తాజాగా మిహికా దగ్గుబాటి ఇన్ స్టాగ్రామ్ లో పింక్ కలర్ షార్ట్ ష్కట్ తో అదిరిపోయే ఫోటోని షేర్ చేసుకున్నారు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని అందంతో ఈ లుక్ లో మిహికా మెరిసిపోతూ ఉండటం విశేషం. మిహికా నటిగా ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ ఫోటోకి అదిరిపోయే క్యాప్షన్ కూడా మిహికా పెట్టారు.

కొన్నిసార్లు రంగులో మార్పు, దృక్కోణంలో మార్పు మాత్రమే రోజును ఉత్సాహంగా ఉంచుతుంది అంటూ మిహికా తన వ్యక్తిత్వాన్ని రిప్రజెంట్ చేస్తూ పింక్ స్కర్ట్ లో గ్లామర్ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.