Begin typing your search above and press return to search.

వీడియో: నయనతార అర్థ‌రాత్రి సాహసం

ఆ స‌మ‌యంలో ఫ్యాన్స్ ఎంతో ఆశ్చ‌ర్యాల‌కు లోన‌వుతుంటారు.

By:  Tupaki Desk   |   5 April 2024 4:49 PM GMT
వీడియో: నయనతార అర్థ‌రాత్రి సాహసం
X

చాలా మంది క్రేజ్ ఉన్న స్టార్లు ఆటోల్లో ప్ర‌యాణించ‌డం లేదా లోక‌ల్ ట్రైన్స్ లో వెళుతూ అభిమానుల‌ను ప‌ల‌క‌రించ‌డం మ‌నం చూస్తున్న‌దే. మీడియాలో ఇలాంటి వార్త‌ల‌కు చాలా క్రేజ్ ఉంది. ఇంత‌కుముందు ఆలియా భ‌ట్, ప్రియాంక చోప్రా, క‌రీనా, సారా అలీఖాన్ లాంటి స్టార్లు లోక‌ల్ ఆటోల్లో ప్ర‌యాణించి అభిమానుల‌ను ప‌ల‌క‌రించిన సంద‌ర్భాలున్నాయి. ఆ స‌మ‌యంలో ఫ్యాన్స్ ఎంతో ఆశ్చ‌ర్యాల‌కు లోన‌వుతుంటారు.

అదంతా ఒకెత్తు అనుకుంటే, ఇప్పుడు భార‌త‌దేశంలోనే గొప్ప స్టార్ గా వెలుగుతున్న `త‌లైవి` న‌య‌న‌తార త‌న స్నేహితుల‌తో క‌లిసి మిడ్ నైట్‌లో ఒక ఫుట్ పాత్ పై ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. చుట్టూ ఆ ప‌రిస‌రాలు ఎంతో నిశ్శ‌బ్ధంగా జ‌న‌సంచారం లేకుండా క‌నిపిస్తోంది. ఆ స‌మ‌యంలో త‌న స్నేహితుల‌తో క‌లిసి న‌య‌న్ ఐస్ క్రీమ్ ని ఎంజాయ్ చేస్తూ ఎంతో జోవియ‌ల్ గా ఆనందంగా క‌నిపించారు. ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న వైరల్ వీడియో అభిమానుల‌కు స్పెష‌ల్ ట్రీట్ గా మారింది.

నయనతార స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియోని అభిమానులు ప‌దే ప‌దే త‌ర‌చి చూస్తున్నారు. నయనతార త‌న‌ ఇద్దరు స్నేహితులు అర్థరాత్రి నిశీధిలో ఒక‌ వీధిలో ఐస్ క్రీం తిన‌డం విచిత్రమైన సంఘ‌ట‌న‌. న‌య‌న‌తార ఒదిగి ఉండే స్వ‌భావాన్ని ఈ ఘ‌ట‌న రివీల్ చేసింది. వారంతా ఐస్ క్రీమ్ తింటుండ‌గా, రోడ్ కి ఆపోజిట్ వీధిలో తనిష్క్ జ్యువెలర్స్ ప్రకటనలో నయనతార బ్యానర్ గ్లింప్స్ ని స్నేహితులు గుర్తించడంతో ఐస్ క్రీం సాహసం మరింత ఆసక్తికర మలుపు తిరిగింది. బిల్‌బోర్డ్ లో న‌య‌న‌తార ఐదున్న‌ర అడుగుల విగ్ర‌హం ఎంతో శోభాయ‌మానంగా క‌నిపిస్తోంది. దాని గురించి నయనతార త‌న‌ స్నేహితుల మధ్య సరదా ఆట వీడియో ఎంతో ఫ‌న్నీగా క‌నిపిస్తోంది. నయనతార వ్యక్తిగత జీవితంలో ఎంత సింపుల్ గా ఉంటారో ఈ వీడియో చూస్తే అర్థ‌మ‌వుతుంది. పెద్ద స్టార్‌లు కూడా సాధారణ ఆనందాలను ఆస్వాధించేందుకు వెన‌కాడ‌ర‌నేందుకు ఇది ఉదాహ‌ర‌ణ‌.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. న‌య‌న‌తార న‌టించిన‌ `జ‌వాన్` బాక్సాఫీస్ వ‌ద్ద 1000 కోట్ల వ‌సూళ్ల‌తో సంచ‌ల‌నం సృష్టించింది. ఇందులో కింగ్ ఖాన్ షారూఖ్ క‌థానాయ‌కుడిగా న‌టించారు. ఆయ‌న‌కు మ‌ర‌పు రాని విజ‌య‌మిది. త‌దుప‌రి న‌య‌న్ వ‌రుస‌గా భారీ చిత్రాల్లో న‌టిస్తోంది. కుముద చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. మ‌న్న‌న‌గ‌ట్టి సిన్స్ 1960 అనే చిత్రంలోను న‌టిస్తోంది.