విమర్శలపై స్పందించిన మ్యూజిక్ డైరెక్టర్
తెలుగు చిత్ర పరిశ్రలమలోని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లలో మిక్కీ జే మేయర్ కూడా ఒకరు. ఆయన ఎన్నో సినిమాలకు సంగీతాన్ని అందించాడు.
By: Tupaki Desk | 4 May 2025 5:30 PMతెలుగు చిత్ర పరిశ్రలమలోని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లలో మిక్కీ జే మేయర్ కూడా ఒకరు. ఆయన ఎన్నో సినిమాలకు సంగీతాన్ని అందించాడు. టాలీవుడ్ లోని ఎంతోమంది టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో మిక్కీ జే మేయర్ కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే రీసెంట్ గా ఆయన సంగీతం అందించిన హిట్3 సినిమా మ్యూజిక్ విషయంలో ఆయన పలు విమర్శలను అందుకున్నాడు.
తన మ్యూజిక్ ను విమర్శిస్తూ కొందరు క్రిటిక్స్ వాడిన పదజాలంతో బాధపడిన ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించి మాట్లాడాడు. తానెప్పుడూ ఇలా రెస్పాండ్ అయింది లేదని, కానీ ఇప్పుడు మాట్లాడాల్సి వచ్చిందని చెప్పిన మిక్కీ జే మేయర్, తన పని డైరెక్టర్లకు ఏం కావాలో అది చేయడం మాత్రమేనని, తన పని అందరికీ నచ్చకపోవచ్చని, అందరినీ మెప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉంటానని అన్నాడు.
కొంతమంది క్రిటిక్స్ అనుకోకుండా వాడుతున్న పదాలు తమను తాము తక్కువ అంచనాలకు గురిచేస్తుందని చెప్పిన మిక్కీ, హిట్3 విషయంలో వస్తున్న విమర్శలపై మాట్లాడాడు. మ్యూజిక్ ఎక్కడ ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చానని, తన టాలెంట్ చూపించాలని, సీన్ వాల్యూ తగ్గించి మరీ తాను బీజీఎంను ఇవ్వలేదని, ఏ సీన్ కు ఎక్కడ ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చానని తెలిపాడు.
గతంలో తాను హ్యాపీ డేస్ మ్యూజిక్, బీజీఎంను కొంతమంది సీనియర్ టెక్నీషియన్లకు వినిపించినప్పుడు అదసలు మ్యూజిక్కేనా? అక్కడక్కడ ఒక పియానో, ఒక గిటార్ తో మాత్రమే వాయించావేంటి అన్నారని కానీ చివరకు అది ఓ క్లాసిక్ అయిందని, తాను డైరెక్టర్ కు ఏం కావాలో, ఎంత కావాలో అంతే ఇస్తానని, ఎప్పుడూ వర్క్ మీద ఫోకస్ తో ఉంటానని చెప్పాడు.
మనం చేసే పని అందరికీ నచ్చాలని లేదని, కొంతమంది క్రిటిక్స్ హద్దులు మీరి మరీ తనను, తన పనిని విమర్శిస్తున్నారని, క్రిటిసిజం కు ఓ పద్దతి ఉంటుందని, హిట్3లో సక్సెస్ లో తన మ్యూజిక్ ఎంతో కీలక పాత్ర పోషించిందని చెప్తున్న మిక్కీ జే మేయర్ సీన్ ఎలివేషన్ లో బీజీఎం చాలా ముఖ్యమైనదని చెప్పాడు. జీసస్ వల్ల, తెలుగు ఆడియన్స్ చూపిస్తున్న ప్రేమ వల్ల తాను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానని, తన మ్యూజిక్ నచ్చని వాళ్లకు తన వర్క్ తో మెప్పిండానికి ప్రయత్నిస్తానని, తన టార్గెట్ అదేనని మిక్కీ చెప్పాడు. అతని పోస్ట్ చూస్తుంటే కొంతమంది వాడిన పదాలు అతన్ని తీవ్రంగా బాధపెట్టాయని అర్థమవుతుంది.