Begin typing your search above and press return to search.

డ‌బ్బు పెట్టి కొనుక్కున్న ఆస్కార్ కొట్టేశారు!

2024 ఆస్కార్‌లలో మెజారిటీ అవార్డుల‌ను క్రిస్టోఫర్ నోలన్ `ఒపెన్‌హైమర్` ఎగ‌రేసుకుపోయింది. ఏడు అకాడమీ అవార్డులను సొంతం చేసుకుంది ఈ చిత్రం

By:  Tupaki Desk   |   13 March 2024 4:00 AM GMT
డ‌బ్బు పెట్టి కొనుక్కున్న ఆస్కార్ కొట్టేశారు!
X

2024 ఆస్కార్‌లలో మెజారిటీ అవార్డుల‌ను క్రిస్టోఫర్ నోలన్ `ఒపెన్‌హైమర్` ఎగ‌రేసుకుపోయింది. ఏడు అకాడమీ అవార్డులను సొంతం చేసుకుంది ఈ చిత్రం. ఇటీవ‌ల ఆస్కార్ ల ట్రివియా గురించి ఎక్కువ చ‌ర్చ సాగుతోంది. ఆస్కార్ పుర‌స్కారాల‌ను సెల‌బ్రిటీలు అమ్ముకోకుండా అప్ప‌ట్లో ఒక నియ‌మం ఉండేది.

1950 నుండి ఆస్కార్ విజేతలు ట్రోఫీని అమ్ముకోవాలంటే $1కి తిరిగి అకాడమీకి మాత్ర‌మే అమ్ముకోవాలి. వాటిని ఓపెన్ మార్కెట్‌లో విక్రయించబోమని రాతపూర్వకంగా అంగీకరించాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని టోకెన్ అమౌంట్‌గా నిర్ణయించారు. `గాన్ విత్ ది విండ్` చిత్రం 1939లో విడుదలైంది. ఇందులో క్లార్క్ గేబుల్, వివియన్ లీ, థామస్ మిచెల్ నటించారు. విక్టర్ ఫ్లెమింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1940లో ఉత్తమ చిత్రం సహా ఎనిమిది ఆస్కార్‌లను గెలుచుకుంది. చివరికి 1999లో వేలంలో మైఖేల్ జాక్సన్ కొనుగోలు చేశారు.

హాలీవుడ్ రిపోర్ట‌ర్ ప్రకారం.. 1940లో `గాన్ విత్ ది విండ్‌`కు వ‌చ్చిన‌ ఆస్కార్‌ను విక్రయించాల‌నుకున్నారు.. నియ‌మాలు ప్రవేశపెట్టబడటానికి ముందు సోత్‌బై వేలానికి పంపారు. మైఖేల్ జాక్సన్ 1.54 మిలియన్ డాలర్ల రికార్డు ధరతో ఈ ట్రోఫీని కొనుగోలు చేశాడు. స‌రైన మేలిమి బంగారం లేని బంగారు విగ్రహం కోసం చెల్లించిన అత్యధిక మొత్తాలలో ఇది ఒకటి. అమ్మకందారులు వేలానికి ముందు ఆస్కార్ కోసం 300కె డాల‌ర్లు పొందవచ్చని ఊహించారు. అయితే మైఖేల్ జాక్సన్ దానిని 413.33 శాతం అధిక మొత్తానికి కొనుగోలు చేసాడు.

2009లో 50 సంవత్సరాల వయస్సులో మైఖేల్ జాక్స‌న్ గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించాడు. ఇది మత్తుమందుల ప్రాణాంతకమైన కలయిక అత‌డి మరణానికి కారణమైనందున ఇది హత్యగా పరిగణించబడింది. 2011లో అతని వ్యక్తిగత వైద్యుడు కాన్రాడ్ ముర్రే అసంకల్పిత నరహత్యకు పాల్పడ్డాడని క‌థ‌నాలొచ్చాయి.

మైఖేల్ జాక్సన్ $1.54 మిలియన్ల ఖ‌రీదైన‌ ఆస్కార్‌ను తన నెవర్‌ల్యాండ్ ఎస్టేట్‌లో లేదా మరణించే వరకు అతడు నివసిస్తున్న లాస్ ఏంజెల్స్ ఇంటిలో ఉంచార‌ని భావించారు. దురదృష్టవశాత్తూ ట్రోఫీ ఎక్కడా కనిపించలేదు. జాక్సన్ కుటుంబ సభ్యుడు అవార్డుతో పారిపోయి ఉండవచ్చు. ఇతర వస్తువులతో కూడిన నిల్వ కేంద్రంలో దాచి ఉండవచ్చు లేదా అతడు మరణించినప్పుడు గొడవ సమయంలో దొంగత‌నానికి గురై ఉండవచ్చు అని అంచ‌నా వేసారు.

ఆస్కార్ దేనితో తయారు చేస్తారు? అంటే.. బ్రిటానియం (93 శాతం టిన్, 5 శాతం యాంటిమోనీ 2 శాతం రాగి) అనే మిశ్రమంతో తయారు చేస్తారు. 24-కారట్ బంగారంతో పూత పూస్తారు. ఆస్కార్ 2024 లేదా 96వ అకాడమీ అవార్డులు మార్చి 10, ఆదివారం నాడు ప్ర‌క‌టించారు.