Begin typing your search above and press return to search.

మృణాల్‌ డబుల్‌ ట్రిపుల్‌ బిజీ బిజీ

టాలీవుడ్‌ లో మెగాస్టార్‌ చిరంజీవికి జోడీగా విశ్వంభర సినిమాను చేయబోతుంది అంటూ గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మృణాల్‌ తెలుగు లో ప్రముఖ స్టార్‌ హీరో సినిమాకు సైన్‌ చేసిందని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   30 Dec 2023 12:30 PM GMT
మృణాల్‌ డబుల్‌ ట్రిపుల్‌ బిజీ బిజీ
X

బాలీవుడ్‌ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయినా కూడా పెద్దగా గుర్తింపు దక్కించుకోలేక పోయిన మృణాల్‌ ఠాకూర్‌ టాలీవుడ్‌ లో సీతారామం సినిమా తో ఎంట్రీ ఇచ్చి సూపర్‌ హిట్‌ ను దక్కించుకుంది. తక్కువ సమయంలోనే సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ గా గుర్తింపు దక్కించుకుంది.

సీతారామం తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకున్న ఈ అమ్మడు హాయ్‌ నాన్న అంటూ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నానితో ఆ సినిమాను చేసిన మృణాల్‌ కి మరో భారీ విజయం దక్కింది. బ్యాక్ టు బ్యాక్‌ బంపర్ హిట్స్ దక్కడంతో మృణాల్‌ ప్రస్తుతం సౌత్‌ లో మోస్ట్‌ బిజీ హీరోయిన్‌ గా వరుస సినిమాలు చేస్తోంది.

టాలీవుడ్‌ లో మెగాస్టార్‌ చిరంజీవికి జోడీగా విశ్వంభర సినిమాను చేయబోతుంది అంటూ గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మృణాల్‌ తెలుగు లో ప్రముఖ స్టార్‌ హీరో సినిమాకు సైన్‌ చేసిందని తెలుస్తోంది. అంతే కాకుండా రాఘవ లారెన్స్‌ తో కలిసి ఒకే సారి రెండు సినిమాలు చేయబోతుందట.

లారెన్స్‌ హీరోగా రమేష్‌ వర్మ దర్శకత్వం లో రూపొందుతున్న శ్రీరామ రక్ష సినిమా ను మృణాల్‌ చేస్తోంది. అంతే కాకుండా రవికుమార్‌ తో లారెన్స్‌ చేస్తున్న సినిమాలో కూడా మృణాల్‌ హీరోయిన్ గా నటించేందుకు రెడీ అయింది. మొత్తానికి ఒకే సారి చేతిలో అయిదు ఆరు సినిమాలతో మృణాల్ బిజీ బిజీగా ఉంది.

సాధారణంగా హీరోయిన్స్‌ రెండు మూడు సినిమాలు చేస్తేనే బిజీ హీరోయిన్‌ అంటాం. అలాంటిది ఈ అమ్మడు డబుల్‌ ట్రిపుల్‌ బిజీ అన్నట్లుగా సినిమాలు చేస్తోంది. ఈ రేంజ్‌ లో బిజీగా ఉన్న మృణాల్‌ టాలీవుడ్‌ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్స్ జాబితాలో ముందు వరుసలో ఉందట.