మెట్‌గాలా వేడుకలో సెలబ్రెటీలకు తప్పని ఆంక్షలు..
ప్రపంచ సినీ రంగానికి ఆస్కార్ ఫిల్మ్ ఫిస్టివల్ ఎంత ప్రత్యేకమైనదో ఫ్యాషన్ రంగానికి మెట్‌గాలా ఈవెంట్ అంతే ప్రతిష్టాత్మకమైనది.
By: Tupaki Desk | 5 May 2025 9:13 PM ISTప్రపంచ సినీ రంగానికి ఆస్కార్ ఫిల్మ్ ఫిస్టివల్ ఎంత ప్రత్యేకమైనదో ఫ్యాషన్ రంగానికి మెట్‌గాలా ఈవెంట్ అంతే ప్రతిష్టాత్మకమైనది. ఎంపిక చేసిన కొందరు సెలబ్రిటీలను మాత్రమే మెట్‌గాలా వేడుకకు ఆహ్వానం దొరుకుతుంది. ఈ వేడుకకు హాజరయ్యే సెలబ్రెటీలు 75 వేల డాలర్లు పెట్టి టిక్కెట్ కొనుగోలు చేసుకొని రావాలంటే ఈ ఈవెంట్ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ వేడుకలో పాల్గొనే సెలబ్రిటీలు మెట్‌గాలా నిబంధనలు ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది.
భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 3 గంటలకు న్యూయార్క్‌లోని మెట్రోపాలిటిన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్‌లో ఈ వేడుక ప్రారంభమవుతుంది. ఈసారి సూపర్‌ఫైన్, టైలరింగ్ బ్లాక్ స్టయిల్ అనే థీమ్‌తో ఈవెంట్ జరుగుతోంది. ఈ మెట్‌గాలా ఈవెంట్‌లో తొలిసారిగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ పాల్గొంటున్నాడు. ఈసారి షారుఖ్‌తో పాటు కియారా అద్వాణీ, ప్రియాంకా చోప్రా తదితరులు కూడా ఈ వేడుకకు హాజరవుతున్నారు.
ఈ వేడుకలో పాల్గొనే సెలబ్రెటీలు లోపలకి ఫోన్లు తీసుకు వెళ్లకూడదు. లోపలకి వెళ్లే ముందు తీసే రెడ్‌కార్పెట్ ఫోటోలు తప్ప ఈవెంట్‌కు సంబంధించిన ఏ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై ఆంక్షలున్నాయి. అలానే లోపలకి వెళ్లాక స్మోకింగ్ చేయడం కూడా నిషేధం. లోపల ఎక్కడ కూర్చోవాలి అనేది ఐదు నెలల ముందే ఎవరికి ఏ టేబుల్ అనేది నిర్ణయిస్తారు. ఈ వేడుకకు ఏ రకమైన దుస్తులు వేసుకొస్తారనేది కూడా నిర్వాహకులకు ముందుగానే పంపించాలి. ఆ డిజైన్ దుస్తులకు నిర్వాహకుల నుంచి ఆమోదం లభిస్తేనే వారు ఆ దుస్తుల్లో రావాలి. లేదంటే దుస్తుల డిజైన్ మార్చుకోవాలి.
ఇంత ప్రతిష్టాత్మక వేడుకలో భోజన ఏర్పాట్లు విషయంలోనూ నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఉల్లి, వెల్లులి, కొత్తిమీర వంటివి ఆహార పదర్ధాల్లో ఉపయోగించారు. ఈవెంట్‌లో పాల్గొనే వాళ్లు మాట్లాడుకునే సమయంలో వీటి గాటు వాసనతో ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఇవి వాడరు. అలానే పాశ్చాత్య దేశాల్లో ఇష్టంగా తినే బ్రుషెట్టా అనే కూరగాయాలతో ఉండే వంటకం కూడా ఈ విందులో నిషేధం. బట్టలపైన పొరపాటున ఈ వంటకం పడితే ఆ మరకలు సాధారణంగా పోవు అంటా.
