Begin typing your search above and press return to search.

ల్యారీ ప‌రువు తీసిన పాకిస్తాన్ డైరెక్ట‌ర్!

ఒక చిత్రం సృష్టించిన వివాదం లేదా ప్రభావం మరొక చిత్రానికి పునాదిగా మారుతుంది. బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన `ధురంధర్` పాన్ ఇండియాలో ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.

By:  Srikanth Kontham   |   15 May 2026 12:48 PM IST
ల్యారీ ప‌రువు తీసిన పాకిస్తాన్ డైరెక్ట‌ర్!
X

ఒక చిత్రం సృష్టించిన వివాదం లేదా ప్రభావం మరొక చిత్రానికి పునాదిగా మారుతుంది. బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన `ధురంధర్` పాన్ ఇండియాలో ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. పాకిస్థాన్‌లోని ల్యారీ ప్రాంతాన్ని, అక్క‌డ పాత్రల్ని ఆధారంగా చేసుకుని ఆదిత్య ధ‌ర్ తెర‌కెక్కించారు. అయితే ల్యారీ ప్రాంతాన్ని కేవ‌లం నేరాలకు నిలయంగా మాత్ర‌మే చూపించారనే కొంత మంది పాకిస్తాన్ ప్ర‌జ‌ల నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈ నేప‌థ్యంలో ఈ సినిమాను నిర‌సిస్తూ ల్యారీ ప్రాంతపు అసలు స్వభావాన్ని అక్కడి సామాజిక జీవనాన్ని సానుకూల కోణంలో ఆవిష్కరించాలనే ఉద్దేశంతో పాకిస్థానీ దర్శకుడు అబు అలీహా `మేరా ల్యారీ` అనే సినిమాను తెర‌కెక్కించారు.

కేవలం కౌంటర్ మూవీగా కాకుండా మహిళా ఫుట్‌బాల్ క్రీడ నేపథ్యంలో స్ఫూర్తిదాయక కథగా తెరకెక్కించారు. `ల్యారీ ప్రాంతమంటే? నేరాలు, ముఠా తగాదాలే కాదు. అక్కడ అద్భుతమైన క్రీడా నైపుణ్యం కలిగిన యువత ముఖ్యంగా ఫుట్‌బాల్ క్రీడాకారిణులు ఉన్నారని ప్రపంచానికి చాటి చెప్పాలని చిత్ర బృందం భావించింది. భారీ అంచనాల మధ్య భావోద్వేగపూరితమైన ప్రమోషన్లతో ఈ చిత్రం తాజాగా రిలీజ్ అయింది. `ధ‌రంధ‌ర్` సినిమాకు `మేరా ల్యారీ` గట్టి సమాధానం ఇస్తుందని పాక్ సినీ వ‌ర్గాలు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నాయి. అయితే తొలి షోతోనే వాళ్ల ఆశ‌ల‌న్నీ ఆవిరైపోయాయి.

బాక్సాఫీస్ లెక్కలు చూస్తే చిత్ర యూనిట్‌కు కోలుకోలేని షాక్ ఇచ్చాయి. కనీసం సొంత దేశంలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది మేరా ల్యారీ. సినిమా కథా గమనం నెమ్మదిగా ఉండటం, బలహీనమైన స్క్రీన్‌ప్లే కారణంగా ప్రేక్షకులు థియేటర్ల వైపు కన్నెత్తి చూడలేదు. విమర్శకులు కూడా ఈ సినిమా ఆశించిన స్థాయిలో లేదని పెద‌వి విరిచేసారు. ఒక సినిమాపై కోపంతో తీసినట్లు ఉందే తప్ప బలమైన కథాబలం లేదని అసంతృప్తిని వ్య‌క్తం చేసారు. ఇక వసూళ్ల పరంగా చూస్తే `మేరా ల్యారీ` పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది.

కొన్ని ప్రధాన నగరాల్లోని థియేటర్లలో ఒక షోకు కేవలం 22 టిక్కెట్లు మాత్రమే అమ్ముడ య్యాయంటే? ఎంతటి పరాజయాన్ని మూటగట్టుకుందో? అర్థం చేసుకోవచ్చు. ఖాళీ కుర్చీలతో షోలు నడపడం సాధ్యం కాక చాలా చోట్ల థియేటర్ల యాజమాన్యాలు ప్రదర్శనలను నిలిపివేశాయి. ఒక ప్రాంతం పరువును కాపా డాలని తీసిన సినిమా ఇలా బాక్సాఫీస్ వద్ద చతికిలపడటం ల్యారీ ప్రాంతానికే అవమానకరంగా మారిందని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఏ సినిమా అయినా ఫ్యాష‌న్ తో తీయాలి త‌ప్ప ఒక‌రిపై కోపం, క‌క్ష‌తో చేస్తే ఫ‌లితాలు ఇంతే దారుణంగా ఉంటాయంటూ నెటి జ‌నులు పోస్టులు పెడుతున్నారు. నిరంత‌రం భార‌త్ పై విషం క‌క్కే పాకిస్తాను వ‌క్ర‌బుద్ది మ‌రోసారి సినిమా రూపంలో కూడా బ‌య‌ట ప‌డింద‌ని జ‌నాలు న‌వ్వుతున్నారు.