Begin typing your search above and press return to search.

బేబీ మీమ్స్.. మరో లెవెల్ ఎంటర్టైన్మెంట్!

ఎవరికి వారు క్రియేటివ్ ని చూపిస్తూ పాత సినిమాలకు సంబంధించిన క్లిప్స్ ను కూడా ఈ సినిమాకు సింక్ అయ్యేలా చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   16 July 2023 4:16 PM GMT
బేబీ మీమ్స్.. మరో లెవెల్ ఎంటర్టైన్మెంట్!
X

సాయిరాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ గట్టిగానే పెంచుకుంటోంది. ఆనంద్ దేవరకొండ ఈ సినిమాలో నటించిన విధానం అలాగే హీరోయిన్ పాత్రలో వైష్ణవి చైతన్య నటించిన విధానం కూడా బాగా క్లిక్ అయింది. మరో ముఖ్యమైన పాత్రలో విరాజ్ అశ్విన్ కూడా బాగానే మెప్పించాడు. దీంతో సినిమా ఇప్పుడు యూత్ కు బాగా దగ్గరవుతొంది.

ప్రస్తుత రోజుల్లో కొంతమంది అమ్మాయిలు సడన్ గా ఎలా మారిపోతారు. మొదట ప్రేమను ఏ విధంగా మోసం చేస్తారో అనే పాయింట్ ను చాలా బలంగా చూపించాడు. ఇది రియాలిటీ కి దగ్గరగా ఉండడంతో ఓ వర్గం యువత అయితే ఎగబడే సినిమాను చూస్తున్నారు. ఇక బ్రేకప్ బాయ్స్ కూడా ఈ సినిమాను చాలా దగ్గరగా తీసుకుంటూ సోషల్ మీడియాలో మరింత వైరల్ అయ్యేలా చేస్తున్నారు.

దాదాపు నేటితరం యువతలో ఈ తరహా స్టోరీ లైన్ గురించి ఎక్కువగా చర్చించుకునేదే కాబట్టి సినిమాకు కమర్షియల్ గా కావాల్సినంత పాజిటివ్ వైబ్ వచ్చేసింది. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ సినిమా కారణంగా మరొక లెవెల్లో ఎంటర్టైన్మెంట్ అయితే అందుతొంది అనే చెప్పాలి. ఎవరికి వారు క్రియేటివ్ ని చూపిస్తూ పాత సినిమాలకు సంబంధించిన క్లిప్స్ ను కూడా ఈ సినిమాకు సింక్ అయ్యేలా చేస్తున్నారు.

ముఖ్యంగా ఈ సినిమా మెయిన్ లైన్ అప్పట్లో వచ్చిన రణం సినిమాలో ఒక పాటలో వచ్చింది అంటూ.. నమ్మొద్దు నమ్మొద్దు స్కూల్ పాపను నమ్మొద్దు.. అని పాటలోని ఒక లైన్ లోనే ఈ సినిమా అర్థం ఉంది అని చెబుతున్నారు. ఇక ఉపేంద్ర పాత సినిమాల్లో అమ్మాయిలు మోసం చేస్తే చితకబాదిన సీన్ ని కూడా ఇప్పుడు వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ఆనంద్ స్థానంలో ఒక్కసారి ఉపేంద్రను ఊహించుకోండి అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

ఇక సింగిల్ గా ఉండేవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్లుగా మరికొన్ని మీమ్స్ వైరల్ చేస్తున్నారు. నాగచైతన్య చెప్పిన ఒక డైలాగ్ అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అనే డైలాగ్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అవుతోంది. ఇక మొదటి నుంచి అయితే ప్రేమిస్తే భరత్ క్లైమాక్స్ సీన్ కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లిస్టులో చేరిపోయింది. మొత్తానికి సోషల్ మీడియాలో అయితే బేబీ సినిమా వలన ఓ వర్గం వారికి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందుతుంది అని చెప్పవచ్చు.