Begin typing your search above and press return to search.

మెహ్రీన్ వయ్యారాల మెరుపులు.. మళ్ళీ ఇన్నాళ్ళకు

టాలీవుడ్ లో మొదట్లోనే గ్లామరస్ బ్యూటీగా మంచి క్రేజ్ అందుకున్న వారిలో మెహ్రీన్ పిర్జాదా ఒకరు

By:  Tupaki Desk   |   14 Feb 2024 7:57 AM GMT
మెహ్రీన్ వయ్యారాల మెరుపులు.. మళ్ళీ ఇన్నాళ్ళకు
X

టాలీవుడ్ లో మొదట్లోనే గ్లామరస్ బ్యూటీగా మంచి క్రేజ్ అందుకున్న వారిలో మెహ్రీన్ పిర్జాదా ఒకరు. నాని హీరోగా వచ్చిన కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమాతో అమ్మడు పరిశ్రమలోకి అడుగు పెట్టింది. అనంతరం వరుస సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాలు చేసింది. ఇక ఆ తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, పంజాబీలో పలు సినిమాలు చేసింది.


దాదాపు అన్ని భాషల్లోనూ మొదట్లో సక్సెస్ ఫుల్ హీరోయిన్​గా గుర్తింపు అయితే తెచ్చుకుంది. ఇక కొంతకాలం నుంచి అమ్మడి టైమ్ కాస్త బాలేదు. వెండితెరపై అంతగా క్లిక్కవ్వకపోయినా గ్లామర్ తో మాత్రం సోషల్ మీడియాలో బాగానే హడావుడి చేస్తోంది. రీసెంట్ గా మెరిసే కలర్ఫుల్ డ్రెస్సులో అమ్మడు వయ్యారంగా నిలబడి ఫొటోలకు పోజులు ఇచ్చింది.


ఇక అందులో ఎద అందాలతో కూడా స్టన్ అయ్యేలా కనిపించింది. ఇక ఈ గ్లామర్ తోనే అమ్మడు మళ్ళీ అవకాశాలు అందుకుంటూ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తోంది. ఇక ఆ మధ్య మెహ్రీన్ ఎంగేజ్మెంట్ తో షాక్ ఇచ్చింది. ఏమైందో తెలియదు కానీ... ఆ తర్వాత పెళ్లి వరకు వచ్చి క్యాన్సిల్ చేసుకున్నట్లు ప్రకటించింది.


వ్యక్తిగత విషయాలను పక్కన ఆమె కెరీర్ లో మొదట వరుస సక్సెస్ లు చూసింది. ఎఫ్​-2 బాగానే ఆడింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు. అయితే దానికి సీక్వెల్​గా అనంతరం ఎఫ్-3 సినిమా వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది.

మెహ్రీన్ నటన చూసి ఓవర్ యాక్టింగ్ చేసిందనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఎఫ్​2 కు వచ్చినా.. క్రేజ్, ఎఫ్​3 కి పెద్దగా రాలేకపోయింది. అనంతరం మరికొన్ని సినిమాలు కూడా బెడిసికొట్టడంతో ఈ భామకు అవకాశాలు తగ్గాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ఓ చిన్న సినిమా చేస్తోంది. ఈ సినిమాపై ఈ భామ భారీ అంచనాలే పెట్టుకున్నట్లు తెలుస్తోంది.