Begin typing your search above and press return to search.

జూ.మిల్కీ బ్యూటీకి చివరి ఛాన్స్‌

మొత్తానికి జూనియర్‌ మిల్కీ బ్యూటీ మెహ్రీన్‌ మెల్ల మెల్లగా కనుమరుగవుతోంది. ఇలాంటి సమయంలో ఈ అమ్మడికి ఓ ఛాన్స్ దక్కింది.

By:  Tupaki Desk   |   9 Nov 2023 3:30 PM GMT
జూ.మిల్కీ బ్యూటీకి చివరి ఛాన్స్‌
X

కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రంతో తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్. ఈ అమ్మడు కెరీర్‌ ఆరంభం లో వరుసగా క్రేజీ హీరోలతో నటించి సక్సెస్‌ లను సొంతం చేసుకుంది. అదే సమయంలో ఈ అమ్మడు జూనియర్ మిల్కీ బ్యూటీ అంటూ గుర్తింపు సొంతం చేసుకుని వరుస ఆఫర్లను దక్కించుకున్న విషయం తెల్సిందే.

మెహ్రీన్‌ జోరు మూడు నాళ్లు ముచ్చటగానే మారిపోయింది. ఈ అమ్మడు చేసిన సినిమాలు ఆ మధ్య బ్యాక్ టు బ్యాక్ నిరాశపరచడంతో ఆఫర్లు తగ్గాయి. ఎఫ్‌ 3 పై చాలా ఆశలు పెట్టుకుని నటించిన మెహ్రీన్ కి నిరాశే మిగిలింది. మొత్తానికి జూనియర్‌ మిల్కీ బ్యూటీ మెహ్రీన్‌ మెల్ల మెల్లగా కనుమరుగవుతోంది. ఇలాంటి సమయంలో ఈ అమ్మడికి ఓ ఛాన్స్ దక్కింది.

ప్రస్తుతం మెహ్రీన్‌ స్పార్క్ సినిమా పై ఆశలు పెట్టుకుని వెయిట్‌ చేస్తోంది. పెద్ద హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ లు ఎలాగూ రావడం లేదు. వచ్చిన ఈ చిన్న ఛాన్స్ ను అయినా మిస్ చేసుకోకుండా సక్సెస్ దక్కించుకోవాలని మెహ్రీన్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. మరి ఈ అమ్మడి ప్రయత్నాలు ఎంతవరకు సఫలం అవుతాయో చూడాలి.

వరుసగా ఫ్లాప్స్ పడటంతో మెహ్రీన్ కి ఆఫర్లే దక్కడం లేదు. ఇలాంటి సమయంలో ఈ అమ్మడికి కచ్చితంగా మినిమం సక్సెస్ అవసరం. ఆ మినిమం సక్సెస్‌ ని స్పార్క్ ఇస్తే పర్వాలేదు. లేదంటే మాత్రం ఈ అమ్మడి కెరీర్‌ టాలీవుడ్‌ లో ముగిసినట్లే అనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇతర భాషల్లో కూడా ఈ అమ్మడికి పెద్దగా ఆఫర్లు కనిపించడం లేదు. మరి జూనియర్ మిల్కీ బ్యూటీ చివరి ఛాన్స్ ఏం జరిగేనో చూడాలి.