అన్ని టెన్షన్‌లు వదిలి హాయిగా యంగ్ బ్యూటీ
కెరీర్ టెన్షన్ లేదు... పెళ్లి ప్రెజర్ లేదు. లవ్వు గివ్వు బ్రేకప్ ల గోల అసలే లేదు. ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. హాయిగా నచ్చినట్టు ఎంజాయ్ చేస్తోంది.
By: Tupaki Desk | 13 April 2025 3:00 AM ISTకెరీర్.. డబ్బు.. కీర్తి.. హోదా! అంటూ చాలా టెన్షన్లు మనిషి నెత్తిన రుద్ర తాండవం ఆడుతూ ఉంటాయి. వాటన్నిటి కోసం పాకులాటతోనే ఒత్తిళ్లను అనుభవించాలి. కానీ అలాంటి ఒత్తిళ్లతో పని లేకుండా ఎంతో హాయిగా చిన్న పిల్లలా ఆటలాడుకునే అవకాశం అదృష్టం అందరికీ ఉండదు. వీటన్నిటికీ అతీతంగా కనిపిస్తోంది ఇక్కడ ఉన్న ఈ అందాల కథానాయిక.
కెరీర్ టెన్షన్ లేదు... పెళ్లి ప్రెజర్ లేదు. లవ్వు గివ్వు బ్రేకప్ ల గోల అసలే లేదు. ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. హాయిగా నచ్చినట్టు ఎంజాయ్ చేస్తోంది. ఒకరికి జవాబు దారీగా ఉండాల్సిన పని కూడా లేదు. ప్రస్తుతం ఇంట్లోనే తనకు నచ్చిన వారితో సరదాగా జీవితం గడుపుతోంది. ముఖ్యంగా తన పెట్ డాగ్ తో. ఈ కథానాయిక ఎవరో ప్రత్యేకించి చెప్పాలా?
మూగ జీవాలతో సావాసంలో చాలా ప్రశాంతతను ఆస్వాధిస్తున్న ఈ హీరోయిన్ - మెహ్రీన్ ఫీర్జదా. ఎఫ్ 2, ఎఫ్ 3 లాంటి బ్లాక్ బస్టర్లలో నటించిన ఈ బ్యూటీ, ఇంకా అభిమానుల హృదయాల్లో హనీగానే తిష్ఠ వేసింది. ఎఫ్ 3 సెట్స్ పై ఉండగానే పెద్ద ధనవంతుడితో నిశ్చితార్థం అయింది. కానీ అది పెళ్లి వరకూ వెళ్లలేదు. వారు అధికారికంగా విడిపోయారు. ఆ తర్వాత మెహ్రీన్ తిరిగి నటనలో కొనసాగింది. కానీ ఇటీవల లైమ్ లైట్ కు దూరంగా ఉంది. ప్రశాంతంగా తన వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాధిస్తోంది. సినిమాలు షూటింగులు అంటూ ఫ్యామిలీ టైమ్ ని స్పెండ్ చేస్తోంది. ఎలాంటి టెన్షన్లు లేకుండా ఇలా పెట్ డాగ్ తో సరదాగా టైమ్ పాస్ చేస్తోంది. నచ్చినట్టు జీవించడంలో ఉండే ఆనందం వేరు. దానిని మెహ్రీన్ సొంతం చేసుకుంది. అన్ని టెన్షన్లకు దూరంగా.. హాయిగా..!
