Begin typing your search above and press return to search.

భోళా శంకర్.. కథ వెనుక పెద్ద సైన్యమే..

రవితేజ 'టచ్ చేసి చూడు'తో డైరెక్టర్ గా మారిన విక్రమ్ సిరికొండ, కన్నన్ అనే మరో రైటర్ కూడా ఈ సినిమా కోసం పని చేశారని మెహర్ తెలిపారు.

By:  Tupaki Desk   |   10 Aug 2023 6:00 AM GMT
భోళా శంకర్.. కథ వెనుక పెద్ద సైన్యమే..
X

మరో రోజులో మెగాస్టార్ చిరంజీవి నటించిన కొత్త సినిమా 'భోళా శంకర్' వరల్డ్ వైడ్ గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంచి. ఈ చిత్రం కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళ బ్లాక్‌ బస్టర్ 'వేదాళం'కు రీమేక్ ఈ చిత్రాన్ని దర్శకుడు మెహర్ రమేశ్ తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంపై కేవలం మెగా ఫ్యాన్స్ తప్ప ఇతర వర్గాల ఆడియెన్స్ భారీ అంచనాలేమి పెట్టుకోలేదనే మాటలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే ఈ చిత్రం రొటీన్ మాస్ మూవీ అవ్వడం, అందులోనూ రీమేక్, పైగా స్టార్ హీరోలందరికీ భారీ డిజాస్టర్లు ఇచ్చిన దర్శకుడు మెహర్ రమేష్ దీనిని డైరెక్ట్ చేయడం.. వంటి కారణాలతో చిత్రంపై కాస్త తక్కువ అంచనాలే ఏర్పడ్డాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఆశించిన విధంగా భారీ స్థాయిలో జరగలేదని తెలిసింది.

అయితే మెహర్ రమేశ్ మాత్రం సినిమాపై ధీమాగా ఉన్నారు. బొమ్మ పక్కా బ్లాక్ బస్టర్ అంటున్నారు. చిరంజీవి ఫ్యాన్స్ ఏం ఆశిస్తారో ఆ ఎలిమెంట్స్ అన్నీ మూవీలో పక్కాగా ఉంటాయని చెప్పారు. ఒరిజినెల్ వెర్షన్ తో పోలిస్తే.. రీమేక్ లో దాదాపు 70శాతం మార్పులు చేసినట్లు వెల్లడించారు. ఈ సినిమాను మరింత బెస్ట్ గా తీర్చిదిద్దేందుతు తమ టీమ్ ఎంతో కృషి చేసిందని చెప్పుకొచ్చారు.

ఈ చిత్రం కోసం సీనియర్ రైటర్ సత్యానంద్ స్క్రిప్ట్ పర్యవేక్షణ చేశారట. పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్'కు మాటలు అందించిన మామిడాల తిరుపతి.. స్క్రిప్ట్ తో పాటు మేకింగ్ విషయంలోనూ కీలకంగా వ్యవహరించారని మెహర్ అన్నారు. ముఖ్యంగా 'వకీల్ సాబ్'లోని తెలంగాణ స్లాంగ్ డైలాగులను తిరుపతి బాగా రాశారని.. అందుకే 'భోళా శంకర్' లో చిరు పాత్రకు తిరుపతితోనే డైలాగులు రాయించినట్లు చెప్పారు.

అయితే చిరు పాత్రకు హైదరాబాద్‌లో ఉన్నంత వరకే ఈ స్లాంగ్‌లో డైలాగ్ ను ఉంటాయని, కలకత్తా బ్యాక్ డ్రాప్ లో సాగే కథకు మామూలుగానే ఉంటుందని మెహర్ వెల్లడించారు. రవితేజ 'టచ్ చేసి చూడు'తో డైరెక్టర్ గా మారిన విక్రమ్ సిరికొండ, కన్నన్ అనే మరో రైటర్ కూడా ఈ సినిమా కోసం పని చేశారని మెహర్ తెలిపారు.

ఇంకా దర్శకులు హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి వంటి స్టార్ డైరెక్టర్లు కూడా ఈ సినిమా స్క్రిప్ట్ రైటింగ్ కోసం తమవంతు చేయూత అందించేందుకు ముందుకు వచ్చారని, కానీ తాను వారి సాయం లేకుండానే స్క్రిప్ట్ ను పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చారు.