పాత జీవితాన్ని మొదలుపెట్టనున్న డైరెక్టర్ మెహర్ రమేష్.. అసలు ఏమైందంటే?
సినిమా ఇండస్ట్రీలో ఉండే 24 విభాగాలలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకోవడానికి ఎంతో మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
By: Madhu Reddy | 10 July 2026 11:04 AM ISTసినిమా ఇండస్ట్రీలో ఉండే 24 విభాగాలలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకోవడానికి ఎంతో మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే సినిమాలలో నటించే నటీనటులు ఒకవైపు తమ నటనతో ఆకట్టుకుంటూనే.. మరొకవైపు ఆ సినిమాలకు నిర్మాతలుగా వ్యవహరించడం లేదా దర్శకులుగా మారడం లాంటివి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఒక విభాగంలో సక్సెస్ లభించకపోతే యూటర్న్ తీసుకున్న సెలబ్రిటీలు కూడా లేకపోలేదు. అంతేకాదు మొదట నటులుగా తమ కెరియర్ ను మొదలుపెట్టి.. ఆ తర్వాత దర్శకులుగా మారి అక్కడ సక్సెస్ కాకపోతే మళ్లీ పాత జీవితాన్ని మొదలుపెట్టిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో మెహర్ రమేష్ కూడా ఒకరు.
మెహర్ రమేష్ కీలక నిర్ణయం..
మొదట తన కెరీర్ ను క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రారంభించారు. అలా 2002లో వచ్చిన బాబీ చిత్రంలో సహాయక పాత్రతో తన కెరీర్ ను ప్రారంభించారు మెహర్ రమేష్. ఇక తర్వాత 2004లో 'వీర కన్నడిగా' అనే చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు.ఇదే చిత్రాన్ని తెలుగులో ఆంధ్రవాలా పేరుతో ఒకేసారి రిలీజ్ చేయగా.. వీర కన్నడిగా సినిమా కన్నడలో బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించగా.. ఆంధ్రావాలా చిత్రం మాత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక తర్వాత 2006లో ఒక్కడు చిత్రానికి రీమేక్ గా అజయ్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక పూర్తిస్థాయి దర్శకుడిగా, తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసింది మాత్రం ఎన్టీఆర్ కంత్రి సినిమాతోనే అనే చెప్పాలి.ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించగా బాక్సాఫీస్ వద్ద పరవాలేదనిపించుకుంది.
డైరెక్టర్గా వర్క్ అవుట్ కాలేదా?
ఆ తర్వాత ప్రభాస్ తో బిల్లా చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. ఇక 2011లో మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ తో శక్తి సినిమా చేశారు. ఇది కూడా డిజాస్టర్ గానే నిలిచింది. ఇక 2013లో షాడో చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. ఇక చివరిగా మెగాస్టార్ చిరంజీవితో భోళాశంకర్ సినిమా చేశారు. కానీ ఇది కూడా డిజాస్టర్ గానే నిలిచింది. ఇక ఈ సినిమా పరాభవంతో కొంతకాలం ఇండస్ట్రీకి దూరమయ్యారు మెహర్ రమేష్. అంతేకాదు ఇటీవలే తన కూతురి పెళ్లిని ఘనంగా నిర్వహించారు కూడా.. ఇకపోతే ఇప్పుడు మళ్లీ తన కెరియర్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తన పాత జీవితాన్ని మళ్లీ తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
24 ఏళ్ల తర్వాత ముఖానికి మేకప్..
అయితే ఈసారి దర్శకుడిగా కాకుండా తన కెరియర్ నటుడిగా మొదలుపెట్టిన మెహర్ రమేష్.. మళ్లీ ఇప్పుడు నటుడి గానే తన ప్రయాణాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఒక సినిమాలో మెహర్ రమేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని, ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయినట్లు సమాచారం. ఏదిఏమైనా 2002లో నటుడిగా బాబీ సినిమాతో వెండితెరకు పరిచయమైన మెహర్ రమేష్.. మళ్ళీ 24 ఏళ్ల తర్వాత ముఖానికి మేకప్ వేసుకోవడం అభిమానులలో ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోలేకపోయిన మెహర్ రమేష్ నటుడిగానైనా సత్తా చాటుతారేమో చూడాలి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
