Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్, మెగాస్టార్ బాండింగ్ కి ఇంతకంటే సాక్ష్యం కావాలా?

మెగా ఫ్యామిలీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి మధ్య బాండింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు

By:  Tupaki Desk   |   7 Aug 2023 5:48 AM GMT
పవన్ కళ్యాణ్, మెగాస్టార్ బాండింగ్ కి ఇంతకంటే సాక్ష్యం కావాలా?
X

మెగా ఫ్యామిలీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి మధ్య బాండింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిజానికి ఇండస్ట్రీ మెగా ఫ్యామిలీ అంటేనే మహా వృక్షం. ఎంతో మందికి నీడని ఇస్తారు. ఎందరో దర్శకులు ఎదుగుదలకి కారణం అయ్యారు. మెగా ఫ్యామిలీ మీద చాలా మంది ఇష్టానుసారంగా విమర్శలు చేస్తూ ఉంటారు. వాటికి ఏనాడూ మెగా హీరోలు రియాక్ట్ అయినా సందర్భాలు లేవు.

మెగాస్టార్ రాజకీయాలు వదిలేసి మళ్ళీ సినిమాలోకి వెళ్లిపోయారు. పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి రాజకీయ వైపు వచ్చారు. ఇద్దరి దారులు వేరైనా ఒకరంటే ఒకరికి అంతులేని ప్రేమ ఉంటుంది. వారితో కలిసి ప్రయాణం చేసేవారికి అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమ, అనుబంధం గురించి అర్ధమవుతోంది. కొంతమంది ఈ మధ్య రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా తిట్టేసి చిరంజీవిని పొగిడేస్తూ ఉన్నారు.

అయితే తాజాగా జరిగిన భోళా శంకర్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో హైపర్ ఆది ఇంటరెస్టింగ్ స్పీచ్ తో మెగాస్టార్, పవర్ స్టార్ మధ్య ఉన్న అనుబంధం గురించి తెలియజేశారు. అలాగే వాల్తేర్ వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బాబీ కూడా అన్నాదమ్ముల మధ్య బాండింగ్ గురించి ఓ సంఘటనతో చెప్పే ప్రయత్నం చేశారు.

పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ ఓ ఇంట్లో జరుగుతున్న సమయంలో ఆ ఇంటి ఓనర్ వచ్చి షూటింగ్ లో పాల్గొన్న అందరిని చెప్పులు వేసుకొని మట్టేస్తున్నారు అంటూ ఇష్టారీతిలో గొడవపడి తిట్టారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా హర్ట్ అయ్యి షూటింగ్ నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం తరువాత గంటకి మెగాస్టార్ చిరంజీవికి తెలిసింది. దీంతో సదరు డాక్టర్ ఫోన్ నెంబర్ తీసుకొని వెంటనే ఫోన్ చేసి అతనిపై మెగాస్టార్ ఉగ్రరూపం చూపించారు.

సినిమా షూటింగ్ లకి ఇల్లు అద్దెకి ఇచ్చిన తర్వాత అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. అలా కాకుండా నా తమ్ముడిని అవమానిస్తావా అంటూ అతనిని తిట్టారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ విషయంలో మెగాస్టార్ చిరంజీవికి అంత ప్రేమ ఉంది. తనని ఎవరైనా ఏమైనా అంటే క్షమించేస్తారు. కానీ తమ్ముడు విషయంలో మాత్రం అంత శాంతమూర్తి కూడా ఉగ్రరూపం చూపిస్తారని బాబీ స్టేజ్ పైన మెగాస్టార్ చిరంజీవి గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.