'మేఘాలు చెప్పిన ప్రేమ కథ'.. మరో టీజర్ చూశారా?
మేఘాలు చెప్పిన ప్రేమ కథ.. టైటిల్ చదివితేనే సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
By: Tupaki Desk | 8 Jun 2025 3:54 PM ISTమేఘాలు చెప్పిన ప్రేమ కథ.. టైటిల్ చదివితేనే సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. యంగ్ హీరో నరేష్ అగస్త్య లీడ్ రోల్ లో నటిస్తున్న ఆ సినిమాలో రబియా ఖాతూన్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. విపిన్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా రెడీ అవుతోంది.
సునేత్ర ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఉమా దేవి కోట నిర్మిస్తున్న ఆ సినిమాలో సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సీనియర్ నటీనటులు సుమన్, ఆమని, తులసి, విద్యుల్లేఖ, తనికెళ్ల భరణి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అయితే సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన వెంటనే ఒక్కసారి పాజిటివ్ క్రియేట్ అయింది. ఆ తర్వాత రీసెంట్ గా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్న ఆ టీజర్.. సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది. మూవీ కథ ఒక ప్రతిభావంతమైన సంగీతకారుడు చుట్టూ తిరుగుతుందన్నట్లు క్లారిటీ ఇచ్చింది.
టీజర్ ప్రామిసింగ్ గా ఉందని అనేక మంది నెటిజన్లు, సినీ ప్రియులు కొనియాడారు. ఇప్పుడు మేకర్స్ తాజాగా మరో టీజర్ ను రిలీజ్ చేశారు. దాని ద్వారా హీరో రోల్ గురించి మరింత సమాచారం అందించారు. ఓడిపోయిన వ్యక్తిగా హీరోను అంతా ట్రీట్ చేస్తుంటారు. అతడు ఓడిపోతానని ఎప్పుడూ అన్ని విషయాల్లో కూడా భయపడుతుంటాడు.
హీరోయిన్ తో ప్రేమలో పడినప్పటికీ వారి మధ్య సమస్యలు అధిగమించలేకపోతుంటాడు. అప్పుడే ఆమని.. ఓడిపోతాననే భయం.. మొదలుపెట్టకుండానే ఓడిస్తుందని చెప్పి మోటివేట్ చేస్తుంది. మరి తర్వాత ఏం జరిగింది? హీరో ఏం చేశాడు? తమ సమస్యలను ఎలా క్లియర్ చేసుకున్నాడు? అనేది మూవీగా టీజర్-2 ద్వారా తెలుస్తుంది!
అయితే టీజర్-2లో కూడా మోహన కృష్ణ ఇచ్చిన బ్యూటిఫుల్ విజువల్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. జస్టిన్ ప్రభాకరన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెర్ఫెక్ట్ గా సెట్ అయింది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. మొత్తంగా ఈ టీజర్ కూడా ప్రామిసింగ్ ఉండి అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమాపై అంచనాలు పెంచుతోంది. త్వరలో మరిన్ని అప్డేట్స్ ను ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.
