Begin typing your search above and press return to search.

కళ్ళాజోడు 'లై' పాప.. వ్వాటే బ్యూటీ!

తాజాగా సముద్రతీరంలో చక్కని సన్ లైట్ ని ఆశ్వాదిస్తూ క్యాజువల్ నైట్ ప్యాంట్, షర్ట్ లో ఫోటోలు తీసుకొని వాటిని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది

By:  Tupaki Desk   |   5 March 2024 3:30 PM GMT
కళ్ళాజోడు లై పాప.. వ్వాటే బ్యూటీ!
X

లై సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ మేఘా ఆకాష్. మొదటి సినిమా ఫ్లాప్ అయిన కూడా నటిగా మంచి మార్కులు కొట్టేసింది. వెంటనే చల్ మోహన రంగా సినిమాలో నితిన్ తో రెండో సారి జతకట్టింది. అయితే ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కోలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీకి సూపర్ స్టార్ రజినీకాంత్ పేట సినిమాలో ఛాన్స్ వచ్చింది.

ఆ మూవీ ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టి శాటిలైట్ శంకర్ అనే సినిమా చేసింది. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. అమ్మడు అందానికి అందం, అభినయం ఉన్నా కూడా నటిగా సరైన సక్సెస్ లు మాత్రం ఖాతాలో పడలేదు. తెలుగులో డియర్ మేఘా, గుర్తుందా శీతాకాలం, ప్రేమదేశం, రావణాసుర, మను చరిత్ర సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఇందులో ఏ ఒక్కటి కూడా కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు. సినిమాలు ఫ్లాప్ అవుతున్న అవకాశాలు మాత్రం ఈ బ్యూటీకి పుష్కలంగా వస్తున్నాయి. ప్రస్తుతం ఈమె చేతిలో మూడు సినిమాలు ఉండగా అందులో ఒకటి తమిళ్ మూవీ కాగా మరో రెండు తెలుసు చిత్రాలే కావడం విశేషం. సహ కుటుంబానామ్ అనే టైటిల్ తో ఓ సినిమా రెడీ అవుతోంది.

స్టార్ హీరోయిన్ కాలేకపోయిన నటిగా మాత్రం చేతినిండా అవకాశాలు మేఘా ఆకాష్ కి ఉండటం విశేషం. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ యాక్టివ్ గానే ఉంటుంది. రెగ్యులర్ గా తనకి సంబందించిన అప్డేట్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె ఫోటోలకి లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి.

తాజాగా సముద్రతీరంలో చక్కని సన్ లైట్ ని ఆశ్వాదిస్తూ క్యాజువల్ నైట్ ప్యాంట్, షర్ట్ లో ఫోటోలు తీసుకొని వాటిని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలు కాస్తా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కళ్ళజోడు పెట్టుకొని చక్కని చిరునవ్వుతో కుర్రాళ్ళ హృదయాలు కొల్లగొట్టేలా ఆమె ఫోజులు ఈ ఫోటోలో ఉండటం విశేషం.