Begin typing your search above and press return to search.

మెగా వెడ్డింగ్: హ‌ల్దీ వేడుక నుంచి లీక్డ్ ఫోటోలు!

ఒక‌ ఫోటోలో పవన్ కళ్యాణ్ తీక్ష‌ణంగా ఫోటోషూట్ల‌ను చూస్తూ క‌నిపించారు. ప్రీ వెడ్డింగ్ వేడుక కోసం వ‌రుణ్- లావ‌ణ్య జంట టుస్కానీలోని అందమైన అవుట్‌డోర్ సెటప్‌ను ఎంచుకున్నట్లు ఒక ఫోటో చెబుతోంది.

By:  Tupaki Desk   |   31 Oct 2023 4:11 PM GMT
మెగా వెడ్డింగ్: హ‌ల్దీ వేడుక నుంచి లీక్డ్ ఫోటోలు!
X

వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి జంట న‌వంబ‌ర్ 1న పెళ్లితో ఒక‌టి కానున్నారు. ఈ వేడుక కోసం ఇట‌లీ టుస్కానీలో వెన్యూ వ‌ద్ద‌కు మెగా ఫ్యామిలీ చేరుకుంది. ఇప్ప‌టికే ప్రీవెడ్డింగ్ వేడుక‌లు వైభ‌వంగా సాగుతున్నాయి. తాజాగా హల్దీ వేడుక నుండి ఫోటోలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ వారం టుస్కానీలో ఈ జంట తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకోనున్నారు. ఆన్‌లైన్‌లో లీక్ అయిన ఫోటోలలో కొన్ని జంట‌లు క‌నిపించాయి. వరుణ్ తేజ్ - లావణ్య తో పాటు నాగ‌బాబు ఆయ‌న శ్రీ‌మ‌తి జంట‌గా క‌నిపించిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. అక్క‌డ‌ కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో దంపతులు ఒకరికొకరు చేతులు ప‌ట్టుకుని ఆప్యాయంగా క‌నిపించారు.


ఒక‌ ఫోటోలో పవన్ కళ్యాణ్ తీక్ష‌ణంగా ఫోటోషూట్ల‌ను చూస్తూ క‌నిపించారు. ప్రీ వెడ్డింగ్ వేడుక కోసం వ‌రుణ్- లావ‌ణ్య జంట టుస్కానీలోని అందమైన అవుట్‌డోర్ సెటప్‌ను ఎంచుకున్నట్లు ఒక ఫోటో చెబుతోంది. @IAmVarunTej - @Itslavanya Haldi వేడుకలో ప్రకాశవంతమైన చిరునవ్వులు, సంతోషకరమైన క్షణాలు ఆ స్వాధిస్తున్నాం. కుటుంబీకులు, స్నేహితులు క‌లిసి ఉన్న ఈ ఫోటోగ్రాఫ్స్ లో వ‌ధూవ‌రుల‌ జంట ఆనందంగా క‌నిపిస్తున్నారు. "హ‌ల్దీ కార్య‌క్ర‌మంతో కొత్త జంట‌ ప్రయాణానికి నాంది పలికారు" అనే శీర్షికతో ఫోటోలను Xలో షేర్ చేసారు.

వరుణ్ -లావణ్య 2016 నుండి స్థిరమైన సంబంధంలో ఉన్నారు. జూన్ 9న ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుకకు రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ సహా వరుణ్ బంధువులతో పాటు వారి సన్నిహిత కుటుంబ సభ్యులు హాజరయ్యారు. న‌వంబ‌ర్ 1న ఈ జంట పెల్లి జ‌ర‌గ‌నుంది. వరుణ్ - లావణ్య మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తుల‌ను ధరిస్తారు. వారి బిగ్ డే కోసం థీమ్ 'పాస్టెల్'. పెళ్లి తర్వాత గ్లామ్ అండ్ గ్లిట్జ్ నేపథ్యంతో రిసెప్షన్ ఉంటుంది. వరుణ్ - లావణ్య నవంబర్ 5 న హైదరాబాద్‌లో తమ ఇండస్ట్రీ స్నేహితుల కోసం మరో రిసెప్షన్ పార్టీని నిర్వహించనున్నారు.