Begin typing your search above and press return to search.

మెగా అప్డేట్.. అనుకున్నట్టే అయ్యింది

కానీ ఆ తర్వాత వశిష్ఠ సినిమాకు సంబంధించి వరుసగా అప్డేట్స్​, రకరకాల ఊహాగానాలు వంటి వార్తలు వచ్చాయే తప్ప.. కళ్యాణ్​ కృష్ణ సినిమాకు సంబంధించి ఏమీ రాలేదు.

By:  Tupaki Desk   |   24 Oct 2023 5:30 AM GMT
మెగా అప్డేట్.. అనుకున్నట్టే అయ్యింది
X

అనుకున్నద్దే జరిగింది. కల్యాణ్​ కృష్ణ సినిమాను మెగాస్టార్ చిరింజీవి పక్కనపెట్టారు. మెగా 156గా వశిష్ఠతో కలిసి సినిమాను చేయబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని గ్రాఫిక్స్​తో డిజైన్ చేసిన ఓ స్పెషల్​ పోస్టర్​తో మేకర్స్ క్లారిటీ చేశారు. ఇప్పుడంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు.


వివరాళ్లోకి వెళితే.. భోళాశంకర్​ వంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి రెండు సినిమాలు లైన్​లో పెట్టిన సంగతి తెలిసిందే. ఒకటి బంగార్రాజు ఫేమ్​ కళ్యాణ్ కృష్ణతో మరొకటి బింబిసార ఫేమ్​ వశిష్ఠతో. మెగా 156గా కళ్యాణ్​ కృష్ణతో రాగా.. మెగా 157గా వశిష్ఠ సినిమా రాబోతుందని ప్రచారం చేశారు.

కానీ ఆ తర్వాత వశిష్ఠ సినిమాకు సంబంధించి వరుసగా అప్డేట్స్​, రకరకాల ఊహాగానాలు వంటి వార్తలు వచ్చాయే తప్ప.. కళ్యాణ్​ కృష్ణ సినిమాకు సంబంధించి ఏమీ రాలేదు. దీంతో కల్యాణ్ కృష్ణ సినిమాను చిరు పక్కనపెట్టారనే ప్రచారం సాగింది. ఇప్పుడా ప్రచారమే నిజమైంది. దసరా పండగా సందర్భంగా రాత్రికి ఓ స్పెషల్ పోస్టర్​ను విడుదల చేశారు మేకర్స్​. మూవీ నిర్మామ సంస్థ యూవీ క్రియేషన్స్​.. ఒక గ్రాఫిక్​తో చేసిన ఆయుధమున్న పోస్టర్​ను విడుదల చేసింది.

మెగా 157 నెంబర్​ను మెగా156గా మార్చి విషయాన్ని క్లారిటీ ఇచ్చింది. అంటే భోళా శంకర్ తర్వాత ఇప్పుడు రానున్న సినిమా ఇదేనన్న మాట. భోళా శంకర్ డిజాస్టర్ కావడం, కథల సెలక్షన్స్​పై భారీగా విమర్శలు రావడంతో.. చిరు ఆత్మపరిశీలన చేసుకుని రీమేక్​ను నో చెప్పి.. ఫాంటసీకి షిఫ్ట్ అయిపోయారు.

ఇకపోతే సినిమాకు సంబంధించి పాట రికార్డింగ్​తో పూజా కార్యక్రమాలు మొదలుపెట్టారట. ఎంఎం కీరవాణి స్వరపరిచిన ఒక సాంగ్​ను రికార్డు చేసినట్టు సమాచారం అందింది. అయితే దీనికి సంబంధించి అధికారిక సమాచారం ఏమీ లేదు. ఈ చిత్రం పూర్తవ్వడానికి వచ్చే ఏడాది అయ్యేలా ఉంది. 2025 సంక్రాంతికి బరిలో దింపాలని మేకర్స్​ ప్లాన్​ చేస్తున్నారట. నలుగురు హీరోయిన్లు నటించే అవకాశముందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..