Begin typing your search above and press return to search.

మెగాస్టార్ విశ్వంభర టైటిల్ గ్లింప్స్.. స్టన్నింగ్ విజువల్స్

మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమాను వశిష్ట తెరపైకి తీసుకురాబోతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 Jan 2024 12:00 PM GMT
మెగాస్టార్ విశ్వంభర టైటిల్ గ్లింప్స్.. స్టన్నింగ్ విజువల్స్
X

మెగాస్టార్ చిరంజీవి ప్రతి సినిమాకు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక గత ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య తో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న ఆయన మళ్లీ నెక్స్ట్ సంక్రాంతికి అంతకుమించి అనేలా అట్రాక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమాను వశిష్ట తెరపైకి తీసుకురాబోతున్న విషయం తెలిసిందే.


యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా ఇదివరకే మొదలైంది ఇక టైటిల్ తోనే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా యూనిట్ ఇప్పుడు టైటిల్ గ్లింప్స్ విడుదల చేసి సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు. ఈ టీజర్ లో విజువల్స్ చూస్తూ ఉంటే సినిమా సరికొత్త తరహాలో ఉండబోతున్నట్లుగా అర్థమవుతుంది.

స్వర్గపు ప్రపంచంలో నుంచి లాక్ చేయబడిన ఒక మ్యాజిక్ బాక్స్ విశ్వం నుంచి కిందకుంపడిపోతుంది. అనంతరం గ్రహశకలం లోకి క్రాష్ అవుతుంది. అనేక ఆటంకాలు మరియు అడ్డంకులు తర్వాత ఆ మాయా వస్తువు చివరకు భూమికి చేరుకుంటుంది. అలాగే ఒక పెద్ద హనుమాన్ విగ్రహంతో ప్రతీకాత్మకంగా హైలెట్ చేశారు. ఇక భూమి పై ఆ మ్యాజిక్ బాక్స్ పడడానికి కారణం ఏంటి? అది హీరోకు ఎలా చేరుతుంది అనే ప్రశ్నలు ఆసక్తిగా ఉన్నాయి.

వీఎఫ్‌ఎక్స్ వర్క్ టాప్ నాచ్‌గా ఉన్నాయి. మరీ ముఖ్యంగా విశ్వంభర అనే టైటిల్ చాలా ఎఫెక్టివ్ గా అనిపిస్తుంది. ఇందులో మెగాస్టార్ సరికొత్త గా పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబొతున్నట్లు తెలుస్తోంది. MM కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ పతాకంపై బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ మెగా ఫాంటసీ అడ్వెంచర్ పై అంచనాలు మతింత పెరిగాయి.

విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభ దశలో ఉంది. 2025 సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.