Begin typing your search above and press return to search.

మెగాస్టార్ 157 కోసం అనీల్ ని దించేస్తున్నారా?

దీనిపై ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు సాగాయి. అయితే తుదిగా మెగా టీమ్ ద‌ర్శ‌కుడి విష‌యంలో ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్లు ఫిలిం స‌ర్కిల్స్ లో వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   8 Jan 2024 1:30 AM GMT
మెగాస్టార్ 157 కోసం అనీల్ ని దించేస్తున్నారా?
X

మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమా విష‌యంలో ఇంకా త‌ర్జ‌న భ‌ర్జ‌న కొన‌సాగుతుందా? లేక ఆ వ్య‌వ‌హారం ఓ కొలిక్కి వ‌చ్చేసిందా? ద‌ర్శ‌కుడు స‌హా క‌థ విష‌యంలో మెగాస్టార్ తుది నిర్ణ‌యం తీసేసుకున్నారా? అంటే అవున‌నే లీకులందుతున్నాయి. తొలుత ఈ సినిమాకి క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని ప్ర‌చారం సాగ‌డం..అటుపై ప్ర‌క‌ట‌న పోస్ట‌ర్ లో ద‌ర్శ‌కుడి పేరు లేక‌పోవ‌డంతో ఆస‌క్తి సంత‌రించుకున్న సంగ‌తి తెలిసిందే.

దీనిపై ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు సాగాయి. అయితే తుదిగా మెగా టీమ్ ద‌ర్శ‌కుడి విష‌యంలో ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్లు ఫిలిం స‌ర్కిల్స్ లో వినిపిస్తోంది. 157వ చిత్రానికి అనీల్ రావిపూడిని ద‌ర్శ‌కుడిగా తీసుకోవాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు వినిపిస్తుంది. వాస్త‌వానికి మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే ప్లాన్ లో అనీల్ ఎప్ప‌టి నుంచో ఉన్న సంగ‌తి తెలిసిందే. కానీ మెగా రేసులో అత‌ని పేరు ఇంత కాలం వినిపించ‌లేదు.

అయితే చిరు తాజాగా కొంద‌రు ద‌ర్శ‌కుల్ని ప‌రిశీలించి యువ ద‌ర్శ‌కుల్లో అనీల్ అయితేనే బెట‌ర్ అని భావించి ముందుకెళ్ల‌డానికి ఆస‌క్తి చూపిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక అనీల్ ట్రాక్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టివ‌ర‌కూ వైఫ‌ల్య‌మే లేదు. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు. అదే స‌క్సెస్ ని చిరంజీవికి అందిస్తాడు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

న‌ట‌సింహ బాల‌కృష్ణ కి `భ‌గ‌వంత్ కేస‌రి`తో ఎలాంటి విజ‌యాన్ని అందించాడో తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చిరంజీవి మ‌రింత ఆస‌క్తిగానూ ఉన్న‌ట్లు తెలుస్తుంది. మెగాస్టార్ కి అనీల్ క‌థ రాస్తున్న‌ట్లు కొన్ని నెల‌ల క్రిత‌మే ప్ర‌చారంలోకి వ‌చ్చింది. తాజాగా ఆ ప‌నులు కూడా పూర్తి చేసి ఉండొచ్చు.ఈ నేప‌థ్యంలో 157 డైరెక్ట‌ర్ దాదాపు క‌న్ప‌మ్ అయ్యారు అనుకోవ‌చ్చ‌ని ఫిలిం స‌ర్కిల్స్ లో గ‌ట్టిగానే చ‌ర్చ‌కొస్తుంది.