Begin typing your search above and press return to search.

మెగా బిగ్ బడ్జెట్ మూవీ.. టైటిల్ ఫిక్స్ అయ్యిందిగా..

మెగాస్టార్ చిరంజీవి 156 సినిమాను యువ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసింది. ఇక ఈ సినిమాను యువీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ నిర్మిస్తోంది.

By:  Tupaki Desk   |   24 Nov 2023 6:16 AM GMT
మెగా బిగ్ బడ్జెట్ మూవీ.. టైటిల్ ఫిక్స్ అయ్యిందిగా..
X

మెగాస్టార్ చిరంజీవి 156 సినిమాను యువ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసింది. ఇక ఈ సినిమాను యువీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ నిర్మిస్తోంది. ఇక మొత్తానికి షూటింగ్ గ్రాండ్గా ఇటీవల మరేడుమిల్లి అడవి ప్రాంతంలో మొదలైంది. సినిమా షూటింగ్ ను అనుకున్న ప్లాన్ ప్రకారం మొదలుపెట్టిన చిత్ర యూనిట్ సభ్యులు వీలైనంత త్వరగా ఈ సినిమాను ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు.


అయితే ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ ఎక్స్ చేశారు అనే విషయంలో చాలా రకాల గాసిప్స్ అయితే వచ్చాయి. ముఖ్యంగా సినిమా ఫాంటసీ అడ్వెంచర్ లేపద్యంలో ఉండబోతుంది అని ఒక గట్టి టాక్ వినిపించింది. దర్శకుడు వశిష్ట ఇదివరకే బింబిసార సినిమాతో ఆ రూట్లో మంచి సక్సెస్ అందుకున్నాడు. దీంతో మెగాస్టార్ చిరంజీవి కథ చెప్పిన వెంటనే గ్రీన్ సిగ్నల్ అయితే విచ్చేస్తాడు.


ఇక ఈ సినిమాపై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ చాలా కాలం తర్వాత జగదేకవీరుడు అతిలోకసుందరి తరహాలో ఉండే కథను చేస్తూ ఉండడంతో ఫ్యాన్స్ లో అయితే చాలా ఆనందంగా ఉన్నారు. తప్పకుండా ఈ సినిమాతో సక్సెస్ అందుకుని బౌన్స్ బ్యాక్ అవుతారు అని అనుకుంటున్నారు. అయితే ఈ సినిమాకు 'విశ్వంభర' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా చాలా రకాల వార్తలు అయితే వచ్చాయి.

కానీ చిత్ర యూనిట్ మాత్రం ఎక్కడా ఆ విషయంలో స్పందించలేదు. ఇక ఇప్పుడు సినిమా షూటింగ్ మొదలు కావడంతో ఆ విషయంలో క్లారిటీ వచ్చేసింది. సినిమాకు లొకేషన్స్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఇక అందులో ఒక షూటింగ్ క్లాప్ బోర్డ్ పై విశ్వంభరా అనే టైటిల్ ఉండడంతో సినిమాకు మొత్తానికి అదే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా అర్థమయిపోయింది.

మొదట చిత్రం ఈ టైటిల్ తో పాటు మరో రెండు టైటిల్స్ కూడా చర్చల్లోకి తీసుకువచ్చారట. కానీ లీక్ అయిన తర్వాత విశ్వంభర కు మంచి రెస్పాన్స్ రావడంతో ఇదే ఫిక్స్ చేయాలి అని అనుకున్నారు. ఇక టైటిల్ విషయంలో అయితే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లకు పైగానే ఉంటుంది అని టాక్ వినిపిస్తోంది. సినిమాను 2025 సంక్రాంతికి తీసుకు రావాలి అని యూవీ క్రియేషన్స్ ప్లాన్ చేస్తోంది.