Begin typing your search above and press return to search.

మెగాస్టార్.. ఏది ముందు?

అయితే వీటిలో ఏది ముందు స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంటే అనిల్ రావిపూడి మూవీ ఉండొచ్చని అంచనా. భగవంత్ కేసరి కంప్లీట్ అయిన తర్వాత అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్రాజెక్ట్ మెగాస్టార్ తో చేసే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది

By:  Tupaki Desk   |   5 Oct 2023 4:41 AM GMT
మెగాస్టార్.. ఏది ముందు?
X

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రీమేక్ కథలని పూర్తిగా పక్కన పెట్టి కొత్త కథలపైన దృష్టి పెడుతున్నారు. అందులో భాగంగా మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ తో టచ్ లోకి వెళ్తున్నారు. ఇప్పటికే సుకుమార్, అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ శ్రీనివాస్ లతో మూవీస్ చేయాలని మెగాస్టార్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ దర్శకులు కూడా చిరంజీవితో సినిమా కోసం ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి, సుకుమార్ కాంబినేషన్ లో అల్లు అరవింద్ మూవీ చేయడానికి సిద్ధంగా ఉన్నారంట. అలాగే డివివి దానయ్య త్రివిక్రమ్ దర్శకత్వంలో మెగాస్టార్ సినిమాని సెట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో మెగాస్టార్ తో మూవీ పట్టాలు ఎక్కే ఛాన్స్ లు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.

అయితే వీటిలో ఏది ముందు స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంటే అనిల్ రావిపూడి మూవీ ఉండొచ్చని అంచనా. భగవంత్ కేసరి కంప్లీట్ అయిన తర్వాత అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్రాజెక్ట్ మెగాస్టార్ తో చేసే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. ఇది కంప్లీట్ అయిన తర్వాత అల్లు అర్జున్ తో సినిమాని పట్టాలు ఎక్కించాల్సి ఉంటుంది.

ఆ ప్రాజెక్ట్ తర్వాతనే మెగాస్టార్ సినిమా ఉండే ఛాన్స్ ఉంది. పుష్ప 2 రిలీజ్ తర్వాత సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్లానింగ్ ఉంటుంది. గతంలో రామ్ చరణ్ తో నెక్స్ట్ మూవీ ఉంటుందని సుకుమార్ చెప్పారు. అయితే రామ్ చరణ్ డేట్స్ వెంటనే దొరికే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ తో మూవీ చేయడానికి ఛాన్స్ ఉంది.

అన్ని కరెక్ట్ గా సెట్ అయ్యి ఉంటే వెంకీ కుడుముల దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మాణంలో సినిమా ఈపాటికే సెట్స్ పైకి వెళ్ళేది. అయితే ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కావడంతో ఇప్పుడు డివివి దానయ్య త్రివిక్రమ్ తో టచ్ లోకి వెళ్తున్నారని తెలుస్తోంది. మరి ఈ కాంబినేషన్స్ లో ఏది ముందుగా స్టార్ట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది.