Begin typing your search above and press return to search.

జనసేన కోసం మెగాస్టార్ ప్రచారం.. నిజమెంత?

అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. చిరంజీవి ప్రస్తుతం యూఎస్ వెళ్తున్నారంట. ఆయన నుంచి ఎన్నికల ప్రచారం కోసం ఎలాంటి కన్ఫర్మేషన్ లేదని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   26 April 2024 10:44 AM GMT
జనసేన కోసం మెగాస్టార్ ప్రచారం.. నిజమెంత?
X

ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావిడి గట్టిగానే నడుస్తోంది. ఓ వైపు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి మరో వైపు వైసీపీ ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల క్షేత్రంలోకి దిగి చురుకుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. అలాగే సినీ తారల హడావుడి కూడా ఈ ఎన్నికల్లో గట్టిగానే కనిపిస్తోంది. జనసేన పార్టీ తరపున హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ లాంటి నటులు ప్రచారం చేస్తున్నారు.

సినిమా ఇండస్ట్రీ నుంచి సెలబ్రెటీలు నచ్చిన పార్టీ, అభ్యర్థుల కోసం సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. ఇక హీరో నిఖిల్ చీరాలలో టీడీపీ తరపున పోటీ చేస్తున్న తన మామయ్య కోసం ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి సిఎం రమేష్, పంచకర్ల రమేష్ కి సపోర్ట్ గా ఒక వీడియో రిలీజ్ చేశారు.

వారిని గెలిపించాలని అభ్యర్ధించారు. దీనిపై వైసీపీ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేసింది. ఈ వీడియో తర్వాత పవన్ కళ్యాణ్ తరపున మెగాస్టార్ చిరంజీవి ప్రచారం చేస్తారనే న్యూస్ తెరపైకి వచ్చింది. మే 5న పిఠాపురం నియోజకవర్గంలో చిరంజీవి ప్రచారానికి రాబోతున్నాడు అంటూ విస్తృతంగా సోషల్ మీడియాలో వార్తలు నడిచాయి.

అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. చిరంజీవి ప్రస్తుతం యూఎస్ వెళ్తున్నారంట. ఆయన నుంచి ఎన్నికల ప్రచారం కోసం ఎలాంటి కన్ఫర్మేషన్ లేదని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఎన్నికల క్యాంపైన్ లో పాల్గొనే అవకాశం లేదనే టాక్ వినిపిస్తోంది. అలాగే మరోవైపు ఆయన తదుపరి సినిమా విశ్వంభర షూటింగ్ లో కూడా గ్యాప్ లేకుండా పాల్గొంటున్నారు.

అయితే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పవన్ కళ్యాణ్ తరపున పిఠాపురంలో ప్రచారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు ఇంకా చాలా మంది పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేసే అవకాశం ఉందని జనసేన వర్గాలలో వినిపిస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి మిగిలిన హీరోలు కూడా పవన్ కళ్యాణ్ కోసం ఎన్నికల ప్రచారంలోకి రావొచ్చని టాక్ నడుస్తోంది.

అయితే మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ కి వీడియో అయిన రిలీజ్ చేసే అవకాశం ఉందని జనసైనికులు భావిస్తున్నారు. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాలలో దూసుకుపోతున్నారు. మరి పవన్ కళ్యాణ్ కి పిఠాపురం ప్రజలు ఈ సారి ఎలాంటి రిజల్ట్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.