Begin typing your search above and press return to search.

అన్నద‌మ్ములిద్ద‌రు ఒకే స్ట్రాట‌జీ!

మెగాస్టార్ చిరంజీవి ..ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్టార్ డ‌మ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కోట్లాది మంది అభిమానించే అగ్ర తార‌లు.

By:  Tupaki Desk   |   14 Aug 2023 8:15 AM IST
అన్నద‌మ్ములిద్ద‌రు ఒకే స్ట్రాట‌జీ!
X

మెగాస్టార్ చిరంజీవి ..ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్టార్ డ‌మ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కోట్లాది మంది అభిమానించే అగ్ర తార‌లు. ఒకే కుటుంబం నుంచి ఇద్ద‌రు స్టార్లు ఆ స్థాయి చ‌రిష్మాను అందుకోవ‌డం అన్న ద‌మ్ములిద్ద‌రికే చెల్లింది. ఇండ‌స్ట్రీలో ఎంత మంది బ్ర‌ద‌ర్స్ ఉన్నా! చిరు-ప‌వ‌న్ లెగ‌స్సీ ఎంతో ప్ర‌త్యేక మైన‌ది. మ‌రి ఈ బ్ర‌ద‌ర్స్ ఈ మ‌ధ్య‌కాలంలో కంటెంట్ ఎంపిక ప‌రంగా ఒకే ర‌క‌మైన స్ట్రాట‌జీని అనుస‌రిస్తున్నారా? అన్న‌ని త‌మ్మ‌డు ఫాలో అవుతున్నాడా? త‌మ్ముడ్ని అన్న ఫాలో అవుతున్నాడా? అంటే చిన్న క‌న్ ప్యూజ‌న్ రెయిజ్ అవుతుంది.

కానీ విధానం మాత్రం ఒకేలా ఉంది. రీమేక్ సినిమాలు చేయ‌డం ఇద్ద‌రికీ కొత్తేం కాదు. స్ట్రెయిట్ సినిమాల‌తో పాటు రిమేక్ చిత్రాల్లోనూ బ్ర‌ద‌ర్స్ న‌టిస్తున్నారు. అయితే చిరంజీవి కంబ్యాక్ మూవీ` ఖైదీ నెంబ‌ర్ 150` నుంచి తెలుగు కంటెంట్ కంటే హిట్ సినిమాకి రీమేక్ ల‌పైనే ఎక్కువ‌గా ఆస‌క్తి చూపించారు. కంబ్యాక్ త‌ర్వాత చిరు నాలుగు సినిమాల్లో రెండు రీమేక్ లే. `గాడ్ ఫాద‌ర్`..ఈ మ‌ధ్య‌నే రిలీజ్ అయిన `భోళాశంక‌ర్. తెలుగు చిత్రాలు `ఆచార్య‌`..`వాల్తేరు వీర‌య్య` చేసారంటే? అందుకు బ‌ల‌మైన కార‌ణాలున్నాయి.

ఆ సినిమాలు తెర‌కెక్కించిన ద‌ర్శ‌కులు కొర‌టాల శివ‌కి..బాబికి మంచి స‌క్సెస్ రేటు ఉంది. ఆ కార‌ణంగా చిరు ఆ చిత్రాలు చేసారు. భోళా శంక‌ర్ ని మెహ‌ర్ ర‌మేష్ కి ఇవ్వ‌డం వెనుక చాలా కార‌ణాలున్నాయి. ప‌దేళ్ల గ్యాప్ త‌ర్వాత చిరు అత‌నికి ఛాన్స్ ఇచ్చారంటే? బంధు ప్రీతి ఉంద‌న్న అంశం బ‌య‌ట‌ప‌డుతుంది. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా `కాట‌మ‌రాయుడు`..`వ‌కీల్ సాబ్`..`భీమ్లా నాయ‌క్`..`బ్రో` లాంటి సినిమాల‌న్నీ కూడా రీమేక్ చిత్రాలు అన్న సంగ‌తి తెలిసిందే. మ‌ధ్య‌లో కొన్ని తెలుగు సినిమాలు చేసాడు.

అందులో మెజార్టీ భాగం త్రివిక్ర‌మ్ తోనే ఉంటాయి. పీకే అత‌న్ని న‌మ్మినంత‌గా మరే ద‌ర్శ‌కుడిని న‌మ్మ‌రు. ఆయ‌న ఏ ప్రాజెక్ట్ టేక‌ప్ చేసినా దాని వెనుక ప‌రోక్షంగా త్రివిక్ర‌మ్ ఉంటార‌ని బ‌ల‌మైన ప్ర‌చారం ఉంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ లైన‌ప్ లో ఉన్న సినిమాల వెనుక గురూజీ ఉన్నారని వినిపిస్తుంది. చిరంజీవి ప్రాజెక్ట్ ల వెనుక మాత్రం ఆయనే బాధ్యులు. ద‌ర్శ‌కుల్ని ఆయ‌నే మెచ్చి తీసుకుంటారు. అవ‌స‌రమైన సూచ‌న‌లు.. స‌ల‌హాలు ఇస్తుంటారు. త్రివిక్ర‌మ్ ర‌చ‌నా శైలిని ఎంతో ఇష్ట‌ప‌డ‌తారు. ఇలా అన్న‌ద‌మ్ములిద్ద‌రు సినిమాలు చేయ‌డం వెనుక ఒకే ర‌క‌మైన స్ట్రాట‌జీతో ముందుకెళ్తున్నారు.