Begin typing your search above and press return to search.

భీమ‌వ‌రం దొర‌బాబుగా మెగాస్టార్!

ప్ర‌స్తుతం మొగా ఫ్యామిలీ అంతా పద్మ‌విభూష‌ణ్ మూవ్ మెంట్స్ ని ఆస్వాదిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఎంతో సంతోషంలో ఉన్నారు

By:  Tupaki Desk   |   29 Jan 2024 8:02 AM GMT
భీమ‌వ‌రం దొర‌బాబుగా మెగాస్టార్!
X

ప్ర‌స్తుతం మొగా ఫ్యామిలీ అంతా పద్మ‌విభూష‌ణ్ మూవ్ మెంట్స్ ని ఆస్వాదిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఎంతో సంతోషంలో ఉన్నారు. ఇప్పుడ‌దే ఉత్సాహంతో 156వ చిత్రం 'విశ్వంభ‌ర' షూటింగ్ లో పాల్గొన డానికి రెడీ అవుతున్నారు. ఇప్ప‌టికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్రం త‌దుప‌రి భారీ షెడ్యూల్ హైద‌రాబాద్ లో జ‌రుగుతోంది. అందుకోసం ప్ర‌త్యేకంగా ఎంతో ఖ‌రీదైన సెట్ ని నిర్మిస్తున్నారు.

ఓ సరికొత్త ప్ర‌పంచంలోకి తీసుకెళ్లే సెట్ ఇది. సెట్ నిర్మాణం చూసిన వారంతో ఎంతో వైభ‌వంగా సెట్ ఉంటుంద‌ని చెబుతున్నారు. మ‌రి ఈ సెట్ లో చిరంజీవి ఎప్పుడు కాలు పెట్ట‌బోతున్నారు? అంటే ఫిబ్ర‌వ‌రి తొలి వారం నుంచి అని తెలుస్తోంది. చిరు జాయిన్ అయిన నాటి నుంచి ఏకధాటిగా షూటింగ్ జ‌రుగు తుంది. ఈ సెట్ లో అన్ని కీల‌క స‌న్నివేశాలే చిత్రీక‌రించే అవ‌కాశం ఉంటుంది కాబ‌ట్టి వాట‌న్నింటిలోనూ చిరు కీల‌క భాగ‌స్వామి కానున్నారు.

ఈ స‌న్నివేశాలు సినిమాలు ఎంతో ప్ర‌త్యేకంగా హైలైట్ కానున్నాయి. ప్రేక్ష‌కుల్ని ఈసెట్ ఓ కొత్త వ‌ర‌ల్డ్ లోకే తీసుకెళ్తుంద‌ని చిత్ర‌బృందం చెబుతుంది. మునుపెన్న‌డు ఇలాంటి సెట్ నిర్మాణం జ‌ర‌గ‌లేద‌ని... అందు కోసం నిర్మాణ సంస్థ కోట్ల రూపాయ‌లు వెచ్చించిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో చిరంజీవి పాత్ర పేరు కూడా బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఇందులో చిరంజీవి భీమ‌వ‌రం దొర‌బాబు పాత్ర‌లో క‌నిపించ‌నున్నారుట‌.

ఆ పాత్ర‌కి జోడీగా ఇద్ద‌రు నాయిక‌లు ఉంటార‌ని తెలిసింది. ఆ మూడు పాత్ర‌ల మ‌ధ్య రొమాంటిక్ స‌న్నివే శాలు...న‌వ్వు తెప్పించే స‌న్నివేశాలుంటాయ‌ని స‌మాచారం. దొర‌బాబు పాత్ర డిజైన్ హాస్య భ‌రితంగా ఉండ‌టంతో పాటు అవ‌స‌రం మేర చిరు శైలి యాక్ష‌న్ లోకి దిగిపోతార‌ని తెలుస్తోంది. ఆ పాత్ర లుక్ కూడా రొటీన్ కి భిన్నంగా ఉంటుందిట‌. ఆయ‌న ఆహార్యం ప్ర‌తీది కొత్త‌గా ఉంటుంద‌ని వినిపిస్తుంది. మొత్తానికి చిరు పాత్ర‌లో చాలా షెడ్స్ ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. ఈ చిత్రాన్ని `బింబిసార` ఫేం మ‌ల్లిడి వశిష్ట ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే.