Begin typing your search above and press return to search.

మెగా మేకోవర్.. ఫ్యాన్స్ కి టెన్షన్..!

నిర్మాతలు యువి క్రియేషన్స్ వంశీ ప్రమోద్ కూడా సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు

By:  Tupaki Desk   |   24 Oct 2023 4:33 AM GMT
మెగా మేకోవర్.. ఫ్యాన్స్ కి టెన్షన్..!
X

150 సినిమాలు చేసిన మెగాస్టార్ చిరంజీవికి సరిపడే కథలు దొరక్కపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని సినిమాలు చేసిన ఆయన అనుభవం మేధస్సు సరైన కథ ఎంపిక చేయడంలో విఫలమవుతున్నాయి. అందుకే ఆయన చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్స్ అవుతున్నాయి. భోళా శంకర్ తర్వాత చిరు ఇక మీదట రీమేక్ ల జోలికి వెల్లకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యారు. అందుకే కూతురు సుస్మిత తో చేయాల్సిన ప్రాజెక్ట్ ని కూడా చివరి నిమిషంలో హోల్డ్ లో పెట్టారు చిరంజీవి.


ఇదిలా ఉంటే ఈమధ్య చిరు చేస్తున్న సినిమాలు అన్నీ చూస్తే ఆయన లుక్ అన్నిటిలో ఒకేలా ఉంది. గాడ్ ఫాదర్ లో డ్రెస్సింగ్ స్టైల్ కాస్త మార్చాడు కానీ వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ ఇలా చిరు లుక్ విషయంలో ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. అందుకే మెగా మేకోవర్ కి టైం ఫిక్స్ చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్ లో చేస్తున్న సినిమాలో మెగాస్టార్ చిరంజీవి డిఫరెంట్ లుక్ తో కనిపిస్తారని తెలుస్తుంది. ఈ లుక్ కోసమే ప్రస్తుతం ఫోటో షూట్ జరుగుతుందట.

మెగా ఫ్యాన్స్ అంతా కూడా చిరుని కొత్తగా చూడాలని కోరుతున్నారు. ఆయన రొటీన్ కామెడీ, రెగ్యులర్ డ్యాన్స్ ఇలా కాకుండా కొత్త క్యారెక్టరైజేషన్ లో కొత్త కథలతో చూడాలని భావిస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో వచ్చే సినిమా సోషియో ఫాంటసీ కథ అని తెలుస్తుంది. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా టైపులో ఈ సినిమా ఉంటుందని టాక్.

నిర్మాతలు యువి క్రియేషన్స్ వంశీ ప్రమోద్ కూడా సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. బింబిసార తో డైరెక్టర్ గా తన ముద్ర వేసిన వశిష్ట మెగాస్టార్ సినిమాతో తనకంటూ ఒక మార్క్ సెట్ చేయాలని చూస్తున్నాడు. అందుకే చిరు లుక్ దగ్గర నుంచి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. మెగాస్టార్ చిరంజీవి వశిష్ట చేస్తున్న ఈ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి.

వశిష్ట సినిమాతో పాటుగా చిరు రైటర్, డైరెక్టర్స్ చెబుతున్న కథలను వింటున్నారని తెలుస్తుంది. సరైన కథ అది కూడా ఒరిజినల్ స్టోరీ అయితేనే సినిమా చేయాలని చూస్తున్నారు. మెగా 156 వశిష్టతో చేస్తుండగా 157 ఎవరి డైరెక్షన్ లో వస్తుంది అన్నది చూడాలి. చిరుతో సినిమా కోసం వెయిటింగ్ లిస్ట్ లో చాలామంది ఉండగా మెగాస్టార్ మాత్రం తనని కదిలించే కథల కోసం వేట కొనసాగిస్తూనే ఉన్నారని తెలుస్తుంది.