Begin typing your search above and press return to search.

ఆ మెగా ప్రాజెక్ట్ లేనట్లేనా?

సినిమా ఇండస్ట్రీలో అనుకున్న ప్రతి సినిమా తెరమీద ఎక్కదు. చాలా కారణాల వల్ల చాలా సినిమాలు మొదలు కాకుండానే ఆగిపోయినవి ఉన్నాయి

By:  Tupaki Desk   |   20 Sep 2023 6:42 AM GMT
ఆ మెగా ప్రాజెక్ట్ లేనట్లేనా?
X

సినిమా ఇండస్ట్రీలో అనుకున్న ప్రతి సినిమా తెరమీద ఎక్కదు. చాలా కారణాల వల్ల చాలా సినిమాలు మొదలు కాకుండానే ఆగిపోయినవి ఉన్నాయి. కొన్ని సినిమాలు అయితే, కొంత భాగం షూటింగ్ జరిగిన తర్వాత కూడా ఏవేవో సమస్యలు వచ్చి ఆగిపోయినవి కూడా ఉన్నాయి. అలా ఆగిపోవడానికి కారణం ఏదైనా కావచ్చు. కాగా, తాజాగా ఇలాంటి వార్తే ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం, మెగాస్టార్ చిరంజీవి సినిమా ఒకటి ఆగిపోయినట్లు తెలుస్తోంది.

చిరంజీవి రీసెంట్ గా భోళా శంకర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఆ తర్వాత ఆయన బంగర్రాజు ఫేమ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన తన పుట్టిన రోజు సందర్భంగా ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఆ సినిమా ఆగిపోయిందట. భోళాశంకర్ రీమేక్ మూవీ కావడంతో ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు.

దీంతో, ఈసారి రీమేక్ మూవీ చేయకూడదు అని చిరు నిర్ణయం తీసేసుకున్నాడట. ముందుగానే కళ్యాణ్ కృష్ణతో మూవీ ఒకే చేసినా, అది కూడా రీమేక్ మూవీ కావడం గమనార్హం. దీంతో, కళ్యాణ్ కృష్ణ ని మరో కథ తయారు చేసుకోమని చెప్పారట. అయితే, కొత్త కథ ఇంకా కాలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆలస్యం అవుతూ ఉండటంతో, ఇప్పుడు ఈ మూవీని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

చిరు ఇచ్చిన సమయంలోగా కళ్యాణ్ కృష్ణ కొత్త కథ చెప్పకపోవడం వల్లే, ఈ మూవీ వాయిదా పడిందని తెలుస్తోంది. దీంతో, ప్రస్తుతం చిరు తన తదుపరి చిత్రం భింబిసార దర్శకతంలో వశిష్ట తో చేస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఈ మూవీ పైనే పూర్తి ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నారట.

ఇక, ఈ సినిమా సోషియో ఫాంటసీ కథగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటిసారి చిరు సినిమా పాన్ ఇండియాగా తెరకెక్కుతోంది. ఈ మూవీ మొదలు అవ్వడానికి కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉంది.