Begin typing your search above and press return to search.

మెగాస్టార్ 156 హోల్డ్ లో ప‌డిందా?

157వ సినిమాని 'బింబిసార' ద‌ర్శ‌కుడు మ‌ల్లిడి వ‌శిష్ట తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇదొక సోషియా ఫాంట‌సీ చిత్రం

By:  Tupaki Desk   |   13 Sep 2023 4:30 PM GMT
మెగాస్టార్ 156 హోల్డ్ లో ప‌డిందా?
X

మెగాస్టార్ చిరంజీవి 156వ చిత్రం ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని చిరంజీవి కుమార్తె సుస్మిత స్వ‌యంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ద‌ర్శ‌కుడు ఎవ‌రు? అన్న‌ది పోస్ట‌ర్ లో రివీల్ చేయ‌లేదు. ఇంత‌వ‌ర‌కూ ఎక్క‌డా అత‌ని పేరు కూడా చెప్ప‌లేదు. దీంతో ఆ దర్శ‌కుడు ఎవ‌రు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. తాజాగా ఈ చిత్రాన్ని చిరంజీవి హోల్డ్ లో పెట్టారా? దీనికంటే ముందు 157వ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌డానికి రెడీ అవుతున్నారా? అంటే అవున‌నే సంకేతాలు అందుతున్నాయి.

157వ సినిమాని 'బింబిసార' ద‌ర్శ‌కుడు మ‌ల్లిడి వ‌శిష్ట తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇదొక సోషియా ఫాంట‌సీ చిత్రం. యూవీ క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తొలిసారి మెగాస్టార్ తో సినిమా నిర్మించే అవ‌కాశం రావ‌డంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తుంది. అతి త్వ‌ర‌లోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు తెలిసింది. ఈ నేప‌థ్యంలో 156వ సినిమా హోల్డ్ లో ప‌డింది అన్న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

156వ చిత్రం ద‌ర్శ‌కుడిగా ప్ర‌ధానంగా క‌ళ్యాణ్ కృష్ణ పేరు వినిపించింది. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ అని కూడా సుస్మిత స్వ‌యంగా రివీల్ చేసారు. కానీ ఇప్పుడీ ప్రాజెక్ట్ విష‌యంలో తాజా సినారే చూస్తుంటే నీలి నీడ‌లు క‌మ్మిన‌ట్లు క‌నిపిస్తోంది. ఆచార్య‌..భోళాశంక‌ర్ లాంటి ప్లాప్ ల‌తో చిరంజీవి ఎంత నెగిటివ్ అయ్యారో తెలిసిందే. ఆ ప్ర‌భావం 156 పై చూపిస్తున్న‌ట్లుంద‌ని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌క‌ట‌న రోజున పోస్ట‌ర్ లో ద‌ర్శ‌కుడు పేరు రివీల్ చేయ‌లేద‌ని ఇప్ప‌టికే ప్ర‌చారంలో ఉంది.

అప్ప‌టిక‌ది తాత్కాలిక ఆలోచ‌న‌గానే ఉన్న‌ప్ప‌టికీ తాజాగా మ‌రో సారి మెగా అండ్ కో విశ్లేషించుకుని ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టిన‌ట్లు తాజాగా వినిపిస్తోన్న మాట‌. మ‌రి హోల్డ్ అవుతుందా? పూర్తిగా ర‌ద్దు చేసే దిశ‌గా బ్యాకెండ్ ఏమైనా నిర్ణ‌యాలు జ‌రుగుతున్నాయా? అన్న‌ది చూడాలి. గ‌తంలో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌-కొర‌టాల శివ సినిమా ఏకంగా పూజా కార్య‌క్ర‌మాల అనంత‌రం ఆపేసిన సంగ‌తి తెలిసిందే.