Begin typing your search above and press return to search.

చిరుకి జోడీగా అనుష్క‌ని సెట్ చేస్తే స‌రి!

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా 157వ సినిమా 'బింబిసార' ఫేం మ‌ల్లిడి వ‌శిష్ట తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   6 Sep 2023 6:22 AM GMT
చిరుకి జోడీగా అనుష్క‌ని సెట్ చేస్తే స‌రి!
X

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా 157వ సినిమా 'బింబిసార' ఫేం మ‌ల్లిడి వ‌శిష్ట తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని యూవీ క్రియేష‌న్స్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. దీనిలో భాగంగా మెగాస్టార్ స‌ర‌స‌న ఏ హీరోయిన్ అయితే బాగుంటుంది అన్న చ‌ర్చ యూనిట్ జోరుగా సాగుతోంది. ఇప్ప‌టికే కాజ‌ల్ అగ‌ర్వాల్..న‌య‌న‌తార‌..త్రిష‌..త‌మ‌న్నా లాంటి భామ‌లు న‌టించేసారు. మ‌ళ్లీ వాళ్ల‌నే తెర‌పైకి తెస్తే అభిమానుల‌కు అంత కిక్ ఉండ‌దు.

అలాగ‌ని చిరు కి జోడీగా కొత్త వాళ్ల‌ని తీసుకొస్తే ఆయ‌న‌కు కూతుళ్లుగా క‌నిపిస్తారు. ఇప్పుడొస్తున్న భామ‌లంతా చెల్లిగానూ..కూమార్తెగా మాత్ర‌మే సెట్ అవుతారు. అలా కాద‌ని ముందుకెళ్తే ర‌వితేజ లా విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ర‌వితేజ గ‌త సినిమా 'ధ‌మాకా' శ్రీలీల‌ని ఎంపిక చేయ‌డంతో రాజా నెట్టింట ట్రోలింగ్ గురైన సంగ‌తి తెలిసిందే. కుమార్తె వ‌య‌సున్న నాయిక‌తో ర‌వితేజ రొమాన్స్ ఏంటి ? అని నెటి జ‌నులు విమ‌ర్శించారు.

ఇలా ఇన్నిరకాల ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో 157లో హీరోయిన్ ని ఎంపిక చేయ‌డం యూనిట్ కి ఓర‌క‌మైన స‌వాల్ గానే మారింది. రిపీట్ చేస్తే మ‌ళ్లీ పాత వాళ్ల‌నే తెర‌పైకి తేవాలి. లేదంటే హీరోయిన్ లేకుండా క‌థ న‌డిపించాలి. అలా చేస్తే తెలుగు సినిమా ఫార్ములాకి అన్యాయం జ‌రిగిన‌ట్లు అవుతుంది. అయితే అంద‌ర్నీ సంతృప్తి ప‌రిచేలా..చిరంజీవి స‌ర‌స‌న ప‌క్కాగా యాప్ట్ అయ్యే హీరోయిన్ ఒక‌రున్నారు.

ఆమె అనుష్క‌. కొంత కాలంగా సినిమాల‌కు బ్రేక్ ఇచ్చిన అనుష్క మ‌ళ్లీ యాక్టివ్ అయిన సంగ‌తి తెలిసిందే. సినిమాలు చేయ‌డానికి..ఓటీటీ లో సైతం క‌నిపించ‌డానికి సిద్దంగా ఉన్నానని హింట్ ఇచ్చేసింది. ఈ నేప‌థ్యంలో చిరంజీవికి జోడీగా అనుష్క‌ని సెట్ చేస్తే స‌రిపోతుంది. వ‌య‌సు కూడా స‌రిపోతుంది. ఇప్పటికే 40 దాటింది. చిరంజీవి ఇటీవ‌లే 68 లో ప‌డ్డారు. కొంత వ్య‌త్యాసం ఉన్నా! అనుష్క క‌టౌట్ తో ఆ ఏజ్ గ్యాప్ ని ప‌ర్ పెక్ట్ గా ఫిల్ చేయ‌గ‌ల‌దు.

పైగా నాగార్జున లాంటి సీనియ‌ర్ తోనూ ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. అన్నింటికి మించి అనుష్క‌ని సెట్ చేయ‌డం యూవీ సంస్థ‌కి చేతిలో ప‌ని. ఆ చిత్ర నిర్మాత‌లు అనుష్క‌కి మంచి స్నేహితులు. ఒక్క సిట్టింగ్ డిస్క‌ష‌న్ జ‌రిగితే చిరంజీవికి హీరోయిన్ సెట్ అయిపోతుంది. ఈ జోడీని తెర‌పై చూడటానికి అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.