Begin typing your search above and press return to search.

చిరంజీవి వాచీ ధ‌ర 2 కోట్లా?

ఇక ఇద్ద‌రు ఎంతో సౌక‌ర్య‌వంతంగా ఉంట‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. చిరంజీవి నిరాడంబ‌రంగా ఉండాల్సిన చోట అలాగే ఉంటారు

By:  Tupaki Desk   |   1 Sep 2023 7:36 AM GMT
చిరంజీవి వాచీ ధ‌ర 2 కోట్లా?
X

మెగాస్టార్ చిరంజీవి స్టార్ స్టేట‌స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కోట్ల‌లో పారితోషికం. సినిమా హిట్ అయితే వంద‌ల కోట్లు..ఒక యాడ్ లో న‌టిస్తే కోట్ల రూపాయ‌ల ఆదాయం. ఇలా రెండు చేతులా సంపాద‌న‌. నిర్మాణ రంగంలోనూ రాణిస్తున్నారు. ఇవి గాక సొంతంగా వ్యాపారాల్లోనూ రాణిస్తున్నారు. ఇంకా త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ బిజినెస్ లు స‌ప‌రేట్. ఇలా తండ్రి-త‌నయులు ఇద్ద‌రు బాగానే సంపాదిస్తున్నారు.

ఇక ఇద్ద‌రు ఎంతో సౌక‌ర్య‌వంతంగా ఉంట‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. చిరంజీవి నిరాడంబ‌రంగా ఉండాల్సిన చోట అలాగే ఉంటారు. ఆస్వాదించాల్సిన చోట ల‌గ్జ‌రీ లైఫ్ స్టైల్ విష‌యంలోనూ ఏమాత్రం త‌గ్గ‌రు. టాలీవుడ్ లో రోల్స్ రాయ్స్ కారు వినియోగించిన మొట్ట మొద‌టి స్టార్ అత‌ను. ఆ త‌ర్వాత ప్ర‌భాస్ కి ఆ హోదా వ‌చ్చింది. తాజాగా చిరంజీవి వాడుతోన్న చేతి వాచీ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయింది.

ర‌క్షా బంధ‌న్ సంద‌ర్భంగా రాఖీ క‌ట్టించుకుంటోన్న స‌మ‌యంలో ఈ మ్యాట‌ర్ లీకైంది. ఆయ‌న చేతికి ఉన్న వాచీ రోలెక్స్ కంపెనీకి చెందిన కాస్మోగ్ర‌ఫీ డేటోనా వైట్ టైగ‌ర్ బ్రాండ్ వాచ్. సాధార‌ణంగా రోలెక్స్ వాచీ ధ‌ర‌లు ఆకాశంలో ఉంటాయి. దీంతో ఆ వాచీ ధ‌ర ఎంతో తెలుసుకోవ‌డానికి ఆన్ లైన్ లో ధ‌ర‌లు చెక్ చేయ‌గా దిమ్మ తిరిగే విష‌యం తేలింది. దారి ధ‌ర 2.35 ల‌క్ష‌ల డాల‌ర్లు. అంటే ఇండియ‌న్ క‌రెన్సీలో సుమార్ 2 కోట్ల వ‌రకూ ఉంటుంద‌ని అంచ‌నా.

ఇక చిరంజీవికి ఇష్ట‌మైన‌వి కూడా వాచీలే. కార్ల‌కంటే కూడా వాటినే ఎక్కువ‌గా ఇష్ట ప‌డుతుంటారు. మార్కెట్ లో కి ఏ బ్రాండ్ వాచీ వ‌చ్చినా చూస్తుంటారు. న‌చ్చితే కొంటుంటారు. అందుకే ఆయ‌న వ‌ద్ద భారీగా వాచీల క‌లెక్ష‌న్ ఉంటుంద‌ని అంటుంటారు. మొత్తానికి చిరంజీవి కాస్ట్ లీ వాచ్ మ్యాట‌ర్ అలా లీకైంది. మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాలి. ప్ర‌స్తుతం చిరంజీవి విశ్రాంతిలో ఉన్నారు. ఇటీవ‌లే ఆయ‌న న‌టించిన 'భోళా శంక‌ర్' రిలీజ్ అయి ఎలాంటి ఫ‌లితాలు సాధించిందో తెలిసిందే.