Begin typing your search above and press return to search.

కూతురు కోసమే వెనకడుగు వేస్తున్న చిరు..?

ఈ మూవీ రిజల్ట్ తర్వాత చిరు కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రీమేక్ మూవీ అంటే, మరింత ఆలోచిస్తున్నాడు

By:  Tupaki Desk   |   26 Aug 2023 4:04 AM GMT
కూతురు కోసమే వెనకడుగు వేస్తున్న చిరు..?
X

మెగాస్టార్ చిరంజీవి ఎన్నో ఆశలు పెట్టుకున్న మూవీ భోళా శంకర్. ఎప్పుుడూ లేని విధంగా ఆయన మూవీ ప్రమోషన్స్ లో సైతం చాలా చురుకుగా పాల్గొన్నారు. ఆ సినిమాను తాను ఎంత వరకు చేయగలరో, అంత వరకు చేశారు. కానీ, ఆ సినిమా బోల్తా పడింది. భోళా శంకర్ రీమేక్ కావడం అసలు మైనస్ గా మారింది. ఒరిజనల్ మూవీని డైరెక్టర్ మక్కీటూ మక్కీ దింపేశాడని, శ్రీముఖితో సీన్లు అతిగా ఉన్నాయని ఇలా కారణం ఏదైనా భోళాను బోల్తా కొట్టేలా చేశారు.

ఈ మూవీ రిజల్ట్ తర్వాత చిరు కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రీమేక్ మూవీ అంటే, మరింత ఆలోచిస్తున్నాడు. చిరు అసలు రీమేక్ మూవీలు చేయవద్దు అంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే, భోళా ఫలితం కి ముందు బంగార్రాజు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణతో ఓ మూవీని ఒకే చేశారు. ఆ మూవీ నిర్మాణ బాధ్యతలను చిరు పెద్ద కుమార్తె సుస్మిత చేపట్టాలని అనుకున్నారు.

భోళా ఫలితం తర్వాత ఆ మూవీ విషయంలో కాస్త వెనక్కి తగ్గారు. ఎందుకంటే, బ్రో డాడి అనే మూవీ రీమేక్ చేయాలని, దానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం చేపట్టాలని అనుకున్నారు. ఇక, ఈ మూవీ రిజల్ట్ తర్వాత మళ్లీ రీమేక్ ఎందుకులే అని ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. అందుకే, కళ్యాణ్ కృష్ణని రీమేక్ మూవీ కాకుండా, ఏదైనా కొత్త కథ రెడీ చేసుకోమని చెప్పారట. లేదంటే, ఆ మూవీ బోల్తా కొడితే, నిర్మాతగా ఉన్న తన కుమార్తె నష్టపోవాల్సి వస్తుందని చిరు భావిస్తున్నారట.

అందుకే, ఈ మూవీ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. తన పుట్టిన రోజున కూడా ఈ మూవీకి సంబంధిచి ఏ అప్ డేట్ ఇవ్వకపోవడానికి కారణం ఇదే. కేవలం బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా గురించి మాత్రమే ప్రకటించారు.

కళ్యాణ్ కృష్ణ చిరుని మెప్పించేలా కథ తెస్తే ఒకే , లేకుంటే, వశిష్టతో మూవీ ముందుగా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇక, వశిష్టతో తీస్తున్న మూవీ చాలా భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీపై అంచనాలు ఇప్పటి నుంచే పెరిగిపోతున్నాయి. మరి చివరకు ఏ మూవీతో ఆయన ముందుగా ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాలి.