Begin typing your search above and press return to search.

చిరంజీవిపై విష ప్ర‌యోగం ఎందుక‌లా జ‌రిగిందంటే?

చివ‌రికి త‌న‌పై విష ప్ర‌యోగం చేసిన‌ వాడిని సైతం క్ష‌మించి వ‌దిలేసిన గొప్ప వ్య‌క్తి. చివ‌రికి ఈ విష‌యాన్ని ఇంత‌వ‌ర‌కూ ఏనాడు ఎక్క‌డా ఒపెన్ అవ్వ‌లేదు

By:  Tupaki Desk   |   22 Aug 2023 10:26 AM GMT
చిరంజీవిపై విష ప్ర‌యోగం ఎందుక‌లా జ‌రిగిందంటే?
X

మెగాస్టార్ చిరంజీవి మృదు స్వభావి. ఎవ‌రిని నొప్పించే మ‌న‌స్త‌త్వం కాదు. ఎంతో స‌హ‌న ప‌రుడు. చివ‌రికి త‌న‌పై విష ప్ర‌యోగం చేసిన‌ వాడిని సైతం క్ష‌మించి వ‌దిలేసిన గొప్ప వ్య‌క్తి. చివ‌రికి ఈ విష‌యాన్ని ఇంత‌వ‌ర‌కూ ఏనాడు ఎక్క‌డా ఒపెన్ అవ్వ‌లేదు. తొలిసారి వాల్తేరు వీర‌య్య‌ వేడుక పంక్ష‌న్ లో భాగంగా ఆ విష ప్ర‌యోగం గురించి తొలిసారి అభిమానుల‌తో పంచుకున్నారు. అస‌లు ఆ రోజు ఏం జ‌రిగిందో తెలుసుకుందాం.

1988లో చిరంజీవి న‌టించిన 'మ‌ర‌ణమృదగం' రిలీజ్ అయింది. అప్ప‌టికే చిరు పెద్ద స్టార్. చెన్నై లొకేష‌న్ లో అభిమానుల తాకిడి తీవ్రంగా ఉంది. ఫోటోల కోసం అభిమానులు ఎగ‌బ‌డేవారు. రోజు షూటింగ్ లో భాగంగా ఆ రోజు మ‌ర‌ణ మృందగం సెట్స్ కి వెళ్లారు. సెట్ బ‌య‌ట అభిమాన‌లు భారీ ఎత్తున ఉండ‌టంతో ఒక‌సారి అభివాదం చేద్దాం అని అలా బ‌య‌ట‌కు వెళ్లారు. ఇంత‌లో ఓ అభిమాని గుంపులో నుంచి దూసుకొచ్చి మీ స‌మ‌క్షంలో బ‌ర్త్ డే జ‌రుపుకుంటాన‌ని త‌న‌తో పాటు తీసుకొచ్చిన కేక్ క‌ట్ చేసాడు.

చిరు వ‌ద్ద‌ని వారించినా కేక్ చిరు నోట్లో పెట్టాడు. రుచి తేడాగా ఉండ‌టంతో చిరు దాన్ని ఉమ్మేసారు. ఆ స‌మ‌యంలో తోపులాట జ‌రుగుతుండ‌గా బ‌ల్ల‌పై ఉన్న కేక్ కింద ప‌డిపోయింది. దీంతో ఆ కేకులో రంగులు బ‌య‌ట ప‌డ్డాయి. ఈ గ్యాప్ లో చిరు మేక‌ప్ సిబ్బంది వ‌చ్చారు. వారు చిరు పెదాలు నీల రంగులోకి మార‌డం గ‌మ‌నించారు. దీంతో విష ప్ర‌యోగం జ‌రిగిందేమో అన్న అనుమానంతో ఆసుప‌త్రికి వెళ్ల‌గా విష‌యం తేలింది. దీంతో విషానికి విరుగుడు ఇచ్చారు. ఆ త‌ర్వాత ఆ కేక్ తెచ్చిన వాడిని అభిమానులు వెతికి ప‌ట్టుకుని త‌న్నే స‌రికి నిజం చెప్పాడు.

అలా చేసింది కూడా అభిమానంతోనే. చిరంజీవి త‌న‌తో మాట్లాడ‌టం లేద‌ని..వేరే వాళ్ల‌తో క్లోజ్ గా ఉండ‌టం స‌హించ‌లేక అలా చేసాన‌ని బ‌ధులిచ్చాడు. కేర‌ళ నుంచి వ‌శీక‌ర‌ణం చేసిన పౌడ‌ర్ అందులో క‌లిపాడుట‌. కోపానికి గురైన అభిమానులు వాడిని కొడుతుంటే చిరంజీవి పెద్ద మ‌న‌సుతో కొట్టొద్ద‌ని క్ష‌మించి వ‌దిలేసారు.