Begin typing your search above and press return to search.

మెగా 157.. అసలు వర్క్ షురూ

మెగాస్టార్ చిరంజీవి తాజాగా భోళా శంకర్ సినిమాతో డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు.

By:  Tupaki Desk   |   10 Sep 2023 10:46 AM GMT
మెగా 157.. అసలు వర్క్ షురూ
X

మెగాస్టార్ చిరంజీవి తాజాగా భోళా శంకర్ సినిమాతో డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా ఎఫెక్ట్ తో రీమేక్ కథలని పూర్తిగా పక్కన పెట్టి కొత్త కాన్సెప్ట్ లపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా కళ్యాణ్ కృష్ణతో బ్రో డాడీ రీమేక్ చేయాలని ముందు డిసైడ్ అయ్యి భోళా శంకర్ దెబ్బతో పక్కన పెట్టి కొత్త స్టొరీ లైన్ పైన వర్క్ చేయిస్తున్నారు. బింబిసారాతో సూపర్ సక్సెస్ అందుకున్న వశిష్ట మల్లిడి దర్శకత్వంలో మూవీని ముందుకి తీసుకొచ్చారు.

సోషియో ఫాంటసీ కథతో అంజి తర్వాత మెగాస్టార్ చేస్తోన్న మూవీ ఇదే కావడం విశేషం. ఇప్పటికే మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. 5 ఎలిమెంట్స్ తో ముడిపడి ఉండే ఫిక్షనల్ సబ్జెక్ట్ గా మెగా 157 ఉండబోతోందని పోస్టర్ తో కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ ని దర్శకుడు వశిష్ట మల్లిడి తుది మెరుగులు దిద్దినట్లు తెలుస్తోంది.

తాజాగా సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేసేశారు. వశిష్ట మల్లిడి, యూవీ క్రియేషన్స్ నిర్మాతలు సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు కలిసి దిగిన ఫోటోని దర్శకుడు వశిష్ట మల్లిడి షేర్ చేసి ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయినట్లు క్లారిటీ ఇచ్చారు. సినిమాలో క్యాస్టింగ్ అండ్ క్రూని ఫైనల్ చేసే పనిలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత షూటింగ్ ఎప్పుడనేది ప్రకటించే ఛాన్స్ ఉంది. యూవీ క్రియేషన్స్ సాహో, రాధేశ్యామ్ తర్వాత భారీ బడ్జెట్ తో చేస్తోన్న పాన్ ఇండియా మూవీ ఇదే కావడం విశేషం. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. బింబిసారా సినిమాతో వశిష్ట మల్లిడి ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు.

మళ్ళీ అలాంటి సోషియో ఫాంటసీ కథ అంటే కచ్చితంగా మరింత బెస్ట్ అవుట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి కూడా మూవీ షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి చిరంజీవికి ఈ మూవీతో వశిష్ట ఎలాంటి హిట్ ఇస్తాడనేది చూడాలి.