Begin typing your search above and press return to search.

ముస్సోరీలో మెగా 157..!

సెకండ్ షెడ్యూల్ ముస్సోరీలో మొదలైందని అనౌన్స్ చేస్తూ ఈ వీడియో క్లిప్ వదిలారు. ఈ క్లిప్ లో స్కూల్ గ్రౌండ్ లో పిల్లలు యూనిఫాం తో కనిపించగా భీమ్స్ ఇచ్చిన బిజిఎం ఆహ్లాదకరంగా ఉంది.

By:  Tupaki Desk   |   11 Jun 2025 7:20 PM
ముస్సోరీలో మెగా 157..!
X

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మెగా 157 సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో పూర్తి చేసుకుంది. సినిమా సెకండ్ షెడ్యూల్ ని ఉత్తరాఖండ్ లోని ముస్సోరీలో మొదలు పెట్టారు. దీనికి సంబంధించిన ఒక చిన్న వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అంటే ఒక బెంచ్ మీద మెగాస్టార్ చిరంజీవి కూర్చుని ఉండగా ఆయనకు ఎదురుగా కొంతమంది స్కూల్ యూనిఫార్మ్ ధరించిన పిల్లలు పరుగెత్తుకుంటూ వస్తారు. చిరు వాళ్లకి థమ్స్ అప్ చూపిస్తాడు.

సెకండ్ షెడ్యూల్ ముస్సోరీలో మొదలైందని అనౌన్స్ చేస్తూ ఈ వీడియో క్లిప్ వదిలారు. ఈ క్లిప్ లో స్కూల్ గ్రౌండ్ లో పిల్లలు యూనిఫాం తో కనిపించగా భీమ్స్ ఇచ్చిన బిజిఎం ఆహ్లాదకరంగా ఉంది. ఈ సెకండ్ షెడ్యూల్ లో సినిమాకు సంబందించిన మెయిన్ కాస్ట్ తో సీన్స్ షూట్ చేస్తారని తెలుస్తుంది. మెగా 157 సినిమాలో చిరు సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వీటీవీ గణేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు.

ఈ సినిమాలో అనిల్ రావిపూడి మెగా ఫ్యాన్స్ కి వింటేజ్ చిరంజీవిని గుర్తు చేస్తాడని అంటున్నారు. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ని మరోసారి ఈ సినిమా ద్వారా ఫ్యాన్స్ కి ఫీస్ట్ అందించే ప్లానింగ్ లో ఉన్నాడట. ఇప్పటికే మొదటి షెడ్యూల్ అవుట్ పుట్ సూపర్ గా వచ్చిందని టాక్. ఇక జరగబోతున్న రెండో షెడ్యూల్ కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్తున్నారట. షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదని తెలుస్తుంది.

మెగా 157 సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి అనిల్ రావిపూడి తన మార్క్ ప్రమోషన్స్ తో ఫ్యాన్స్ కి ఎంగేజ్ చేస్తున్నాడు. లేటెస్ట్ గా ముస్సోరీ లో సెకండ్ షెడ్యూల్ అనేది కూడా ఒక ప్రమోషన్స్ రూపంలో ఇచ్చాడంటే అనిల్ మెగా ప్లాన్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాను 2026 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. చిరు అనిల్ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. చిరంజీవి కూడా అనిల్ వర్క్ కి ఇంప్రెస్ అయ్యాడని తెలుస్తుంది. సినిమాను చాలా తక్కువ రోజుల్లో పూర్తి చేసే డైరెక్టర్స్ ఈమధ్య కరువవుతున్నారు. అనిల్ మాత్రం అనుకున్న షెడ్యూల్ ప్రకారం సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేస్తున్నాడు. మెగా 157 కూడా సంక్రాంతికి రాదన్న డౌట్ ఏమాత్రం అక్కర్లేదని అనిపిస్తుంది.