Begin typing your search above and press return to search.

ప్రయత్నించడంలో విసుగు చెందని మెగా హీరో..!

ఇక అనిల్ రావిపుడి డైరెక్షన్ లో వచ్చిన F2, F3 రెండు సినిమాలు వరుణ్ తేజ్ ఖాతాలో సక్సెస్ ఫుల్ సినిమాలుగా నిలిచాయి

By:  Tupaki Desk   |   7 April 2024 6:43 AM GMT
ప్రయత్నించడంలో విసుగు చెందని మెగా హీరో..!
X

మెగా హీరోల్లో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ప్రయోగాలు చేస్తూ వస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఫలితాలు ఎలా ఉన్నా కూడా తను చేయాలనుకున్న ప్రయత్నాల నుంచి వెనక్కి తగ్గట్లేదు. వరుణ్ తేజ్ నటించిన 13 సినిమాల మీద ఒక లుక్కేస్తే సినిమా సినిమాకు కొత్తగా ట్రై చేస్తూ వచ్చాడు. గద్దలకొండ గణేష్ తో తనలోని మాస్ యాంగిల్ చూపించిన వరుణ్ తేజ్ గని తో బాక్సర్ గా క్రేజీ అటెంప్ట్ చేసినా వర్క్ అవుట్ కాలేదు. ఇక అనిల్ రావిపుడి డైరెక్షన్ లో వచ్చిన F2, F3 రెండు సినిమాలు వరుణ్ తేజ్ ఖాతాలో సక్సెస్ ఫుల్ సినిమాలుగా నిలిచాయి.

లాస్ట్ ఇయర్ గాంఢీవదారి అర్జున, ఈ ఇయర్ వచ్చిన ఆపరేషన్ వాలెంటైన్ రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా వర్క్ అవుట్ అవుతాయని అనుకోగా అవి కాస్త తుస్సుమనిపించాయి. అయితే సినిమా ఫలితాలు తేడా కొడుతున్నా కూడా వరుణ్ తేజ్ తన ప్రయోగాలు చేసే విషయంలో రాజీ పడట్లేదు. ఆపరేషన్ వాలెంటైన్ సినిమా తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అవ్వగా అంతకుముందు వచ్చిన ఫైటర్ ఎఫెక్ట్ దీని మీద పడటంతో సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు.

సినిమా కథల వల్లనో లేక సరైన దర్శకుల ఎంపిక వల్లనో కానీ వరుణ్ తేజ్ ఎఫర్ట్ పెడుతున్నా కూడా సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ కరుణ కుమార్ డైరెక్షన్ లో మట్కా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ ప్లానింగ్ ఉంది. అయితే ఈ సినిమా బడ్జెట్ విషయంలో దర్శక నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నాయని టాక్. ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ నెక్స్ట్ సినిమా డైరెక్టర్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ యువ దర్శకుడు మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడని టాక్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలతో సక్సెస్ అందుకున్న మేర్లపాక గాంధీ నానితో చేసిన కృష్ణార్జున యుద్ధం సినిమా వర్క్ అవుట్ కాలేదు. ఆ తర్వాత మ్యాస్ట్రో సినిమా డైరెక్ట్ చేసిన మేర్లపాక గాంధీ రెండేళ్ల క్రితం లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ సినిమా చేశాడు. డైరెక్టర్ గా తన మార్క్ చాటుతున్న మేర్లపాక గాంధీ వరుణ్ తేజ్ కోసం అద్భుతమైన కథ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది.

ఈ సినిమా కథ ఏంటి ప్రొడ్యూసర్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. వరుణ్ తేజ్ తో మేర్లపాక గాంధీ తన స్టైల్ లో ఎంటర్టైనింగ్ కథ చేస్తాడా లేదా వరుణ్ తేజ్ పంథాలో ఒక ఎక్స్ పెరిమెంట్ చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. మేర్లపాక గాంధీ, వరుణ్ తేజ్ కాంబో మూవీ అనౌన్స్ మెంట్ త్వరలో రానుంది. మట్కాతో పాటుగా ఈ సినిమాను కూడా ఒకేసారి సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు వరుణ్ తేజ్.