Begin typing your search above and press return to search.

మట్కా కోసం మెగా ప్రిన్స్ మేకోవర్..!

వరుణ్ తేజ్ తన నెక్స్ట్ సినిమా కరుణ కుమార్ డైరెక్షన్ లో చేస్తున్నాడు. మట్కా అంటూ పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా ప్లాన్ చేశారు

By:  Tupaki Desk   |   1 Sep 2023 5:01 AM GMT
మట్కా కోసం మెగా ప్రిన్స్ మేకోవర్..!
X

మెగా హీరోల్లో తన పంథాలో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. రీసెంట్ గా గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ ఆ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నా అది వర్క్ అవుట్ కాలేదు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 50 కోట్ల పైన బడ్జెట్ తో తెరకెక్కిన గాండీవధారి అర్జున సినిమా భారీ లాస్ తెచ్చినట్టు తెలుస్తుంది. అయితే హిట్లు ఫ్లాపులు కెరీర్ లో సహజమే కాబట్టి వరుణ్ తేజ్ కూడా ఆ సినిమా రిజల్ట్ చూసి కొంత అసంతృప్తిగా ఉన్నా తన నెక్స్ట్ సినిమా మీద మళ్లీ ఫోకస్ చేస్తున్నాడు.

వరుణ్ తేజ్ తన నెక్స్ట్ సినిమా కరుణ కుమార్ డైరెక్షన్ లో చేస్తున్నాడు. మట్కా అంటూ పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా ప్లాన్ చేశారు. పలాస సినిమాతో రా అండ్ రస్టిక్ డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న కరుణ కుమార్ శ్రీదేవి సోడా సెంటర్ సినిమా తర్వాత కొద్ది పాటి గ్యాప్ తో మట్కా చేస్తున్నాడు. వైరా క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. పీరియాడికల్ డ్రామాగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ మేకోవర్ అదిరిపోతుందని తెలుస్తుంది. మట్కా సినిమాలో వరుణ్ తేజ్ 4 డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తాడని టాక్. ఆ 4 రోల్స్ లో 4 డిఫరెంట్ లుక్స్ లో వరుణ్ తేజ్ కనిపిస్తాడట. వరుణ్ తేజ్ కెరీర్ లో మట్కా సంథింగ్ స్పెషల్ ప్రాజెక్ట్ అవుతుందని చెబుతున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా వరుణ్ తేజ్ చేస్తున్న ప్రయత్నాలు ఎంకరేజ్ చేయాలని చూస్తున్నా సరైన సినిమా మాత్రం పడట్లేదు. ఆల్రెడీ సెట్స్ మీద వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ఉంది. ఆ సినిమాను శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు.

వరుణ్ తేజ్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా అదే అని చెప్పొచ్చు. హిందీ తెలుగు బైలింగ్వల్ మూవీగా ఆపరేషన్ వాలెంటైన్ వస్తుంది. ఆ సినిమాలో మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆపరేషన్ వాలెంటైన్ డిసెంబర్ లో రిలీజ్ ఫిక్స్ చేశారు. మట్కా మాత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లి నెక్స్ట్ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. వరుణ్ తేజ్ చేస్తున్న హార్డ్ వర్క్ కి తోడు హిట్లు కూడా సపోర్ట్ చేస్తే మెగా హీరో ఇంకా ఎన్నో కొత్త ప్రయోగాలు చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు.