Begin typing your search above and press return to search.

సోద‌రితో రాఖీ పండ‌గ‌.. ఫియాన్సీతో జిమ్మింగ్

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ రాఖీ పండ‌గ రోజు టైమ్ ఎలా స్పెండ్ చేసాడు? అంటే దానికి స‌మాధానం ఇక్క‌డ ఉంది

By:  Tupaki Desk   |   1 Sep 2023 4:31 AM GMT
సోద‌రితో రాఖీ పండ‌గ‌.. ఫియాన్సీతో జిమ్మింగ్
X

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ రాఖీ పండ‌గ రోజు టైమ్ ఎలా స్పెండ్ చేసాడు? అంటే దానికి స‌మాధానం ఇక్క‌డ ఉంది. త‌న మ‌న‌సు దోచిన లావ‌ణ్య‌ను త్వ‌ర‌లోనే పెళ్లాడేయ‌బోతున్న ఈ మెగా బుల్లోడు రాఖీ పండ‌గ రోజున త‌న సోద‌రి నిహారిక కుటుంబ స‌భ్యుల‌తో వేడుక‌గా టైమ్ ని స్పెండ్ చేశాడు. తన సోదరి నిహారిక రక్షా బంధన్ శుభ సందర్భంగా అన్న‌య్య‌కు రాఖీ కట్టి ఆశీస్సులు అందుకుంది. అనంత‌రం వరుణ్ తేజ్ లావణ్యతో జిమ్ సెషన్ కి వెళ్లాడు.


ఫ్యామిలీతో అత‌డు విలువైన స‌మ‌యాన్ని వెచ్చించేందుకు ఎప్పుడూ వెన‌కాడ‌డు. ప్ర‌తిసారీ పండ‌గ‌ల వేళ కుటుంబంతో గ‌డిపేందుకు ప్రాధాన్య‌త‌నిస్తాడు. షూటింగ్ షెడ్యూల్స్ ఉన్నా వాటిని ముగించుకుని పెద‌నాన్న చిరంజీవి బ్లెస్సింగ్స్ ని కూడా తీసుకుంటాడు. ఈసారి రాఖీ పండ‌గ‌కు మెగా కుటుంబం అంతా ఓచోట చేరి సంద‌డి చేసింది. మెగా సోద‌రుల‌కు సోద‌రీమ‌ణులు రాఖీలు క‌ట్టారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. దర్శకుడు కరుణ కుమార్‌తో తన తదుపరి సినిమా కోసం వరుణ్ తేజ్ ప్రస్తుతం జిమ్‌లో చాలా కష్టపడుతున్నాడని కూడా తెలిసింది. ఆస‌క్తిక‌రంగా త‌న ఫియాన్సీతో క‌లిసి జిమ్ చేయ‌డంలో అత‌డు ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. గాండీవ‌ధారి అర్జున సినిమా కోసం వ‌రుణ్ చాలా వ‌ర‌కూ జిమ్ చేసి లుక్ మార్చాడు. ఇప్పుడు త‌దుప‌రి సినిమాలోను ఛాలెంజింగ్ రోల్ లో న‌టించాల్సి ఉంది. అందుకే వ‌రుణ్ పూర్తిగా త‌న లుక్ ని మార్చేస్తున్నాడ‌ని తెలిసింది.

నాలుగు గెట‌ప్పుల‌తో మెగా ప్రిన్స్ ట్రీట్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మొదటి పాన్ ఇండియా చిత్రం 'మట్కా'లో నాలుగు విభిన్న వేష‌ధార‌ణ‌ల‌తో క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం. ప‌లాస ఫేం కరుణ కుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. వ‌రుణ్ ఇటీవ‌ల‌ తన పాత్ర కోసం పూర్తిగా సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో అత్యంత భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్క‌నుంది. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ కండలు తిరిగిన ఫిజిక్ కోసం తీవ్రంగా శ్ర‌మిస్తున్నాడు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటిస్తున్న మట్కా చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.